The text of and illustrations in this document are licensed by Red Hat under a Creative Commons Attribution–Share Alike 3.0 Unported license ("CC-BY-SA"). An explanation of CC-BY-SA is available at http://creativecommons.org/licenses/by-sa/3.0/. In accordance with CC-BY-SA, if you distribute this document or an adaptation of it, you must provide the URL for the original version.
Red Hat, as the licensor of this document, waives the right to enforce, and agrees not to assert, Section 4d of CC-BY-SA to the fullest extent permitted by applicable law.
Red Hat, Red Hat Enterprise Linux, the Shadowman logo, JBoss, MetaMatrix, Fedora, the Infinity Logo, and RHCE are trademarks of Red Hat, Inc., registered in the United States and other countries.
Linux® is the registered trademark of Linus Torvalds in the United States and other countries.
Java® is a registered trademark of Oracle and/or its affiliates.
XFS® is a trademark of Silicon Graphics International Corp. or its subsidiaries in the United States and/or other countries.
All other trademarks are the property of their respective owners.
Red Hat అనునది Red Hat Enterprise Linux 6 యొక్క అందుబాటును ప్రకటించుటకు ఆనందంగావుంది. Red Hat Enterprise Linux 6 అనునది Red Hat యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్ కాంప్రెహెన్సివ్ సూట్, మిషన్-క్రిటికల్ యెంటర్‌ప్రైజ్ కంప్యూటింగ్ కొరకు రూపొందించబడెను మరియు ఎంటర్‌ప్రైజ్ సాఫ్టువేర్ మరియు హార్డువేర్ అమ్మకందారుల ద్వారా ధృవీకరించబడెను.
ఈ విడుదల ఈ కింది ఆకృతలలో వొకే కిట్ గా అందుబాటులో వుంది:
i386
AMD64/Intel64
System z
IBM Power (64-bit)
ఈ విడుదల నందు, Red Hat అనునది సర్వర్, సిస్టమ్స్ మరియు మొత్తం Red Hat వోపెన్ సోర్స్ అనుభూతి పైన కొత్త మెరుగుదలలను కలిపి తెస్తోంది.
Note
విడుదల నోట్స్ యొక్క యీ వర్షన్ కాలముదాటిన సారమును కలిగివుండవచ్చును. ఈ విడుదల నందు కలిగివున్న కొత్త విశేషణముల ప్రస్తుత సమీక్ష కొరకు ఆన్‌లైన్ విడుదల నోట్స్ చూడండి.
2. సంస్థాపకి
Red Hat Enterprise Linux సంస్థాపకి (anacondaగా కూడా తెలియబడును) యిది Red Hat Enterprise Linux 6 యొక్క సంస్థాపనకు సహాయపడును. విడుదల నోట్స్ యొక్క యీ విభాగము Red Hat Enterprise Linux 6 కొరకు సంస్థాపకినందు కొత్తగా అభివృద్ది పరచినవిశేషణముల గురించి వొక సమీక్షను యిస్తుంది.
ఇకపై చదువుటకు
Red Hat Enterprise Linux 6 సంస్థాపనా మార్గదర్శిని అనునది సంస్థాపకి మరియు సంస్థాపనా విధానము గురించి విశదీకృత పత్రికీకరణను అందించును.
2.1. సంస్థాపనా విధానములు
సంస్థాపకి Red Hat Enterprise Linuxను సంస్థాపించుటకు మూడు ముఖ్యమైన యింటర్ఫేసులను అందించును: కిక్‌స్టార్, గ్రాఫికల్ సంస్థాపకి మరియు టెక్స్టు-ఆధారిత సంస్థాపకి.
2.1.1. గ్రాఫికల్ సంస్థాపకి
Red Hat Enterprise Linux గ్రాఫికల్ సంస్థాపకి అనునది సిస్టమ్‌ను సంస్థాపనకు సిద్దపరచుటలో ముఖ్యమైన అంచెలుగుండా వినియోగదారిని తీసుకొనివెళుతుంది. Red Hat Enterprise Linux 6 సంస్థాపనా GUI అనునది డిస్కు విభజనీకరణకు మరియు నిల్వ ఆకృతీకరణకు ముఖ్యమైన వినియోగపు పొడిగింపులను యిచ్చును.
సంస్థాపనా కార్యక్రమములో ముందుగా, వినియోగదారికి యిప్పుడు ప్రాధమిక నిల్వ పరికరములు లేదా ప్రత్యేక నిల్వ పరికరములు అను రెండు ఐచ్చికములు యీయబడును. ప్రాధమిక నిల్వ పరికరములు కు సాధారణంగా ఆపరికరము వుపయోగకరం కావటానికి ముందుగా యే అదనపు ఆకృతీకరణ అమర్పులు అవసరములేదు. ప్రత్యేకించిన నిల్వ పరికరములను ఆకృతీకరించుటకు వొక కొత్త యింటర్ఫేస్ అభివృద్దిపరచబడెను. ఫర్మువేర్ RAID పరికరములు, ఫైబర్ చానల్ వోవర్ ఈథర్నెట్ (FCoE) పరికరములు, మల్టీపాత్ పరికరములు, మరియు యితర స్టోరేజ్ యేరియా నెట్వర్కు (SAN) పరికరములు యిప్పుడు కొత్త యింటర్ఫేస్ వుపయోగించి సులువుగా ఆకృతీకరించబడును.
Figure 1. ప్రత్యేకించిన నిల్వ పరికరముల ఆకృతీకరణ
ప్రతి అప్రమేయ విభజనీకరణ నమూనాకు విశదీకృత వివరణలను మరియు చిత్రములను అందించుతూ, విభజనీకరణ నమూనాలను యెంచుకొను యింటర్ఫేస్ విస్తరించబడెను.
Figure 2. విభజనీకరణ లేవుట్ ఐచ్చికములు
సంస్థాపనకు ముందుగా నిల్వ పరికరములు అనువాటిని సంస్థాపనా లక్ష్యపు పరికరములుగా లేదా డాటా నిల్వ పరికరములుగా తెలుపుటకు సంస్థాపకి అనుమతించును.
Figure 3. నిల్వ పరికరములను తెలుపుట
2.1.2. కిక్‌స్టార్ట్
కిక్‌స్టార్ అనునది స్వయంచాలన సంస్థాపనా విధానము దానిని సిస్టమ్ నిర్వహణాధికారులు Red Hat Enterprise Linuxను సంస్థాపించుటకు వుపయోగిస్తారు. కిక్‌స్టార్ట్ వుపయోగించి, వొక వొంటరి ఫైలు సృష్టించబడును, అది సాధారణ సంస్థాపనచే అడుగబడు అన్ని ప్రశ్నలకు సమాధానములను కలిగివుండును.
Red Hat Enterprise Linux 6 అనునది కిక్‌స్టార్ట్ ఫైళ్ళ యొక్క వాలిడేషన్‌కు మెరుగుదలలను ప్రవేశపెట్టినది, అది సంస్థాపన ప్రారంభమునకు ముందుగనే కిక్‌స్టార్ట్ ఫైలు సిన్టాక్స్ సమస్యలను సంస్థాపకి పసిగట్టుటకు అనుమతించును.
2.1.3. టెక్స్ట్-ఆధారిత సంస్థాపకి
టెక్స్ట్-ఆధారిత సంస్థాపకి అనునది పరిమితమైన వనరులు వున్న సిస్టమ్స్ కొరకు అందించబడెను. టెక్స్ట్-ఆధారిత సంస్థాపిక సరళపరచబడెను, అది అప్రమేయ డిస్కు నమూనాలకు సంస్థాపనను అనుమతించుచున్నది, మరియు కొత్త నవీకరించిన ప్యాకేజీల సంస్థాపనను అనుమతించుచున్నది.
Figure 4. టెక్స్ట్-ఆధారిత సంస్థాపిక
Note
కొన్ని సంస్థాపనలకు అధునాతన సంస్థాపనా ఐచ్చికములు అవసరము అవి టెక్స్ట్-ఆధారిత సంస్థాపకి నందు వుండవు. ఒకవేళ లక్ష్యపు సిస్టమ్ గ్రాఫికల్ సంస్థాపకిని స్థానికంగా నడుపలేక పోతే, సంస్థాపనను పూర్తిచేయుటకు వర్చ్యువల్ నెట్వర్క్ కంప్యూటింగ్ (VNC) ప్రదర్శనను వుపయోగించండి.
2.2. సంస్థాపననందు బ్యాకప్ సంకేతపదములను సృష్టించుట
Red Hat Enterprise Linux 6 నందలి సంస్థాపకి ఎన్క్రిప్టెడ్ ఫైల్‌సిస్టమ్స్ కొరకు ఎన్క్రిప్షన్ కీలను దాచే మరియు బ్యాకప్ సంకేతపదములను సృష్టించే సామర్థ్యాన్ని యిస్తుంది. ఈ విశేషణము Section 8.3, “ఎన్క్రిప్టెడ్ నిల్వ పరికరముల కొరకు బ్యాకప్ సంకేతపదములు” నందు యింకా వివరంగా చర్చించబడింది.
Note
ప్రస్తుతం, సంస్థాపననందు బ్యాకప్ సంకేతపదములను ఎన్క్రిప్టెడ్ పరికరముల కొరకు సృష్టించుట కిక్‌స్టార్టు సంస్థాపననందు మాత్రమే సాధ్యము. ఈ కొత్త విశేషణముపై మరింత సమాచారము కొరకు, మరియు Red Hat Enterprise Linux 6 యొక్క కిక్‌స్టార్ట్ సంస్థాపననందు ఈ విశేషణమును యెలా వుపయోగించాలి అనేదాని కొరకు, యిక్కడ సంస్థాపనా మార్గదర్శిని నందలి డిస్కు యెన్క్రిప్షన్ యెపెన్‌డెక్స్ చూడండి.
2.3. DVD మీడియా బూట్ కాటలాగ్ ప్రవేశములు
Red Hat Enterprise Linux 6 కొరకు DVD మాధ్యమం అనునది బూట్ కాటలాగ్ ప్రవేశములను BIOS- మరియు UEFI-ఆధారిత కంప్యూటర్లు రెంటి కొరకు కలిగివుంటాయి. ఇది సిస్టమ్సును వాటియొక్క ఫర్మువేర్ యింటర్‌ఫేస్‌పై ఆధారపడి బూట్ చేయగల్గుటకు మాధ్యమాన్ని అనుమతించును. (UEFI అనునది యూనిఫైడ్ ఎక్సుటెన్సిబుల్ ఫర్మువేర్ యింటర్ఫేస్, యిది ప్రాధమికంగా Intel చే అభివృద్దిపరచబడి యిప్పుడు యూనిఫైడ్ EFI ఫోరమ్ చేత నిర్వహించబడుచున్న వొక ప్రామాణిక సాఫ్టువేర్ యింటర్ఫేస్. ఇది పాత BIOS ఫర్మువేర్ పునస్థాపనకు వుద్దేశించినది.)
Important
పాత BIOS అమలుపరచిన కొన్ని సిస్టమ్స్ వొకటి కన్నా యెక్కువ బూట్ కాటలాగ్ ప్రవేశాలను కలిగివున్న మాధ్యమం నుండి బూట్ కావు. అటువంటి సిస్టమ్స్ Red Hat Enterprise Linux 6 DVD నుండి బూట్ కావు అయితే USB డ్రైవు లేదా PXE వుపయోగించి నెట్వర్కునందు బూట్ కావచ్చు.
Note
UEFI మరియు BIOS బూట్ ఆకృతీకరణలు వొకదానికి వొకటి విభేదించును మరియు వొకదానినుండి వొకదానికి మార్చుటకు వీలుకాదు. Red Hat Enterprise Linux 6 అది ఆకృతీకరించబడిన ఫర్మువేర్ మార్చబడితే అది బూట్ కాదు. ఉదాహరణకు, BIOS-ఆధారిత సిస్టమ్‌పై ఆపరేటింగ్ సిస్టమ్ సంస్థాపించి మరియు సంస్థాపించిన యిన్‌స్టాన్సును UEFI-ఆధారిత సిస్టమ్‌పై బూట్ చేయలేరు.
2.4. సంస్థాపనా క్రాష్ నివేదించుట
Red Hat Enterprise Linux 6 విశేషణములు సంస్థాపకినందు సంస్థాపనా క్రాష్ నివేదీకరణను విస్తరింపచేసెను. సంస్థాపనా సమయమందు సంస్థాపకి వొక దోషమును యెదుర్కొంటే, దోషము యొక్క వివరములు వినియోగదారికి నివేదించబడును.
సంస్థాపనల యొక్క ట్రబుల్‌షూటింగ్ మరియు డీబగ్గింగ్‌కు సహాయపడుటకు, సంస్థాపకి ద్వారా అందివ్వబడిన అదనపు వివరములు యిప్పుడు లాగ్ ఫైళ్ళనందు చేర్చబడును. సంస్థాపనా లాగ్స్ పై యింకా సమాచారము కొరకు, ట్రబుల్‌షూటింగ్ కొరకు వాటిని యెలా వుపయోగించాలి అనేది సంస్థాపనా మార్గదర్శిని యొక్క కింది విభాగములనందు చూడవచ్చును.
నిల్వ నిర్వహణా మార్గదర్శిని అనునది Red Hat Enterprise Linux 6 పైన ఫైల్ సిస్టమ్సును యెలా ప్రభావవంతంగా నిర్వహించాలి అనేదానిపై యింకా సూచనలను అందించును. అదనంగా, గ్లోబల్ ఫైల్ సిస్టమ్ 2 పత్రము Red Hat Enterprise Linux 6 కొరకు Red Hat గ్లోబల్ ఫైల్ సిస్టమ్ 2 ఆకృతీకరణ మరియు నిర్వహణ పై ప్రత్యేక సమాచారమును వివరించును.
3.1. ఫోర్త్ ఎక్సుటెండెడ్ ఫైల్‌సిస్టమ్ (ext4) మద్దతు
ఫోర్త్ ఎక్సుటెండెడ్ ఫైల్ సిస్టమ్ (ext4) అనునది థర్డ్ ఎక్సుటెండెడ్ ఫైల్‌సిస్టమ్ (ext3) పై ఆధారపడినది మరియు చాలా మెరుగుదలలను అందించును. పెద్ద ఫైల్ సిస్టమ్స్ మరియు పెద్ద ఫైళ్ళు, వేగవంతమైన మరియు సమర్ధవంతమైన డిస్కు జాగా కేటాయింపు, వొక డైరెక్టరీ లోపల వుపడైరక్టరీలపై పరిమితి లేకపోవుటం, వేగవంతమైన ఫల్‌సిస్టమ్ పరిశీలన, మరియు అధిక రబస్ట్ జర్నలింగ్ అనువాటికి మద్దతును అందించును. ext4 ఫైల్ సిస్టమ్ అప్రమేయంగా యెంచుకొనబడును మరియు అధికంగా సిఫార్సు చేయడమైంది.
3.2. XFS
XFS అనునది అధికంగా స్కేలబుల్, అధిక-పనితనపు ఫైల్ సిస్టమ్ యిది వాస్తవంగా Silicon Graphics, Inc. వద్ద రూపొందించబడెను. ఇది ఫైల్‌సిస్టమ్సును 16 exabytes (దాదాపు 16 million terabytes) వరకు, ఫైళ్ళను 8 exabytes (దాదాపు 8 million terabytes) వరకు మరియు డైరెక్టరీ ఆకృతులు పదులు కొద్దీ మిలియన్ల ప్రవేశాలను కలిగివుండుటను మద్దతించుటకు యిది సృష్టించబడెను.
XFS అనునది మెటాడాటా జర్నలింగ్‌ను మద్దతించును, యిది త్వరితంగా క్రాష్ నుండి కోలుకొనునట్లు చేయును. మౌంటైవున్నప్పుడు మరియు క్రియాశీలముగావున్నప్పుడు కూడా XFS ఫైల్ సిస్టమ్స్ డీఫ్రాగ్‌మెంట్ మరియు విస్తరణ కాగలవు.
3.3. బ్లాక్ డిస్‌కార్డ్ — పలచగా ఏర్పాటైన LUNలు మరియు SSD పరికరముల కొరకు విస్తరిత మద్దతు
Red Hat Enterprise Linux 6 నందలి ఫైల్‌సిస్టమ్స్ కొత్త బ్లాక్ డిస్‌కార్డ్ విశేషణాన్ని వుపయోగించి, ఫైల్‌సిస్టమ్ వొక పరికరము యొక్క విభాగములు (బ్లాక్స్ గా కూడా పిలువబడును) క్రియాశీలంగా వుపయోగంలో లేవు అనునది గుర్తించగానే అది నిల్వ పరికరముకు తెలుచునట్లు చేయును. కొన్ని నిల్వ పరికరములు బ్లాక్ డిస్కార్డ్ సామర్ధ్యాలను అందించునప్పుడు, కొత్త సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ (SSDs) అంతర్గత డాటా లేవుట్‌ను ఆప్టిమైజ్ చేయుటకు యీ విశేషణాన్ని వుపయోగించును మరియు ప్రోయాక్టివ్ వేర్ లెవలింగ్‌ను మెల్కొలుపును. అదనంగా, పలచగా రూపోందిన LUNల అభివృద్ది సహాయం కొరకు కొన్ని మేలుజాతి SCSI పరికరములు బ్లాక్ డిస్కార్డు సమాచారమును వుపయోగించును.
3.4. నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ (NFS)
నెట్వర్కు ఫైల్ సిస్టమ్ (NFS) అనునవి దూరస్థ హోస్టులు ఫైల్ సిస్టమ్సును నెట్వర్కు నందు మౌంట్ చేయుటకు అనుమతించును మరియు అవి స్థానికంగా మౌంటైవున్న కారణంగా ఆ ఫైల్‌సిస్టమ్సుతో యింటరాక్ట్ అగుటకు అనుమతించును. ఇది నిర్వహణాధికారులు నెట్వర్కునందు కేంద్రీకృత సర్వర్లపై వనరులను సంఘటితపరచుటకు దోహదపడును. Red Hat Enterprise Linux 6 అనునది NFSv2, NFSv3, మరియు NFSv4 క్లైంట్లను మద్దతించును. NFS ద్వారా వొక ఫైల్ సిస్టమ్‌ను మౌంట్ చేయుట అనునది యిప్పుడు NFSv4కు అప్రమితం అగును.
Red Hat Enterprise Linux 6 నందు అదనపు మెరుగుదలలు NFSకు చేయబడెను, ఇంటర్నెట్ ప్రొటోకాల్ వర్షన్ 6 (IPv6) కు విస్తరిత మద్దతును అందించుట ద్వారా.
4. నిల్వ
4.1. నిల్వ ఇన్పుట్/అవుట్పుట్ సర్దుబాటు మరియు పరిమాణము
SCSI మరియు ATA ప్రమాణాలకు యిటీవలి విస్తరింపులు నిల్వ పరికరములను వాటి అభీష్ట (మరియు కొన్ని సందర్భములలో, అవసరమైన) I/O సర్దుబాటు మరియు I/O పరిమాణము సూచించుటకు అనుమతించును. 512 బెట్లనుండి 4K బెట్లకు భౌతిక సెక్టార్ పరిమాణమును పెంచే కొత్త డిస్కు డ్రైవులతో ఈ సమాచారము వుపయోగకరంగా వుండును. ఈ సమాచారము RAID పరికరములకుకూడా వుపయోగకరంగా వుండును, యిచట చంక్ పరిమాణము మరియు స్ట్రైప్ పరిమాణము పనితనంను ప్రభావితం చేయును.
ఈ సమాచారమును చదువే మరియు వుపయోగించుకొనే సామర్ధ్యమును Red Hat Enterprise Linux 6 అందించును, మరియు నిల్వ పరికరముల నుండి డాటా యెలా చదువుబడును మరియు వ్రాయబడును ఆప్టిమైజ్ చేయును.
డివైస్ మాపర్ మల్టీపాత్ (DM-Multipath)అనునది సర్వర్లను నిల్వ యెరేలకు అనుసంధానించే బహుళ కేబుల్స్, స్విచెస్ మరియు నియంత్రికల నుండి వొంటరి కాన్పెప్చువల్ పరికరమును సృష్టించును. ఇది అనుసంధానపు పరికరముల యొక్క కేంద్రీకృత నిర్వహణను చేతనపరచును (పాత్‌లుగా కూడా తెలుపబడను) మరియు అన్ని అందుబాటులోని పాత్‌లనందు భారములను సమతుల్య పరచుట సాధ్యమే.
పాత్‌ల నందు భారమును డైనమిక్‌గా సమతుల్య పరచునప్పుడు DM-Multipath అనునది Red Hat Enterprise Linux 6 నందు రెండు కొత్త ఐచ్చికాలను యిస్తోంది. పాత్‌లు అనునవి వాటి యొక్క క్యూ పరిమాణమును బట్టి లేదా గత I/O టైమ్ డాటాను బట్టి యెంపిక చేసుకొనవచ్చు.
యికపై చదువుటకు
DM మల్టీపాత్ పుస్తంకం Red Hat Enterprise Linux 6 యొక్క డివైజ్-మాపర్ విశేషణమును వుపయోగించుటపై సమాచారమును అందించును.
4.3. లాజికల్ వాల్యూమ్ మానేజర్ (LVM)
వాల్యూమ్ నిర్వహణ అనునది భౌతిక నిల్వ నందు లాజిక నిల్వ వాల్యూమ్‌లను సృష్టించుట ద్వారా ఆబ్‌స్ట్రాక్షన్ లేయర్‌ను సృష్టించును. భౌతిక నిల్వను నేరుగా వుపయోగించుటలో యిది మంచి అనుకూలతను కల్పించును. Red Hat Enterprise Linux 6 అనునది లాజికల్ వాల్యూమ్ మేనేజర్ (LVM) వుపయోగించి లాజికల్ వాల్యూమ్‌లను నిర్వహించును.
Important
system-config-lvm అనునది లాజికల్ వాల్యూమ్‌లను నిర్వహించుటకు Red Hat Enterprise Linux నందు అందించబడిన గ్రాఫికల్ యూజర్ యింటర్ఫేస్. system-config-lvm ద్వారా అందివ్వబడిన పంక్షనాలిటి అనునది యింకా సులువుగా నిర్వహించగలిగిన సాధనముకు gnome-disk-utility (palimpsest గా కూడా తెలియును) మారు స్థితిలో వుంది . ఫలితంగా, Red Hat చాలా అనువుగా వుండును system-config-lvm నవీకరించుటకు. gnome-disk-utility అనునది system-config-lvm తో పీచర్ పారిటి చేరుకొనిన కారణంగా, Red Hatకు Red Hat Enterprise Linux 6 యొక్క జీవితకాలంలోsystem-config-lvmను తొలగించగల హక్కువుంది.
యికపై చదువుటకు
లాజికల్ వాల్యూమ్ మేనేజర్ నిర్వహణ పత్రము అనునది LVM లాజికల్ వాల్యూమ్ మేనేజర్‌ను వివరించును, కస్టర్ వాతావరణమునందు LVMను నడుపుటపై సమాచారమును అందించును.
4.3.1. LVM మిర్రర్ మెరుగుదలలు
LVM మిర్రర్ వాల్యూమ్‌లను మద్దతించును. మిర్రర్ లాజికల్ వాల్యూమ్‌లను సృష్టించుట ద్వారా, భౌతిక వాల్యూమ్‌కు వ్రాసిన డాటా ప్రత్యేక భౌతిక వాల్యూమ్‌నకు మిర్రర్ అగునట్లు LVM చూచుకొనును.
4.3.1.1. మిర్రర్ల యొక్క స్నాప్‌షాట్లు
LVM స్నాప్‌షాట్ విశేషణము లజికల్ వాల్యూమ్ యొక్క బ్యాకప్ ప్రతిబింబములను ఫలానా సందర్భములో యెటువంటి సేవా ఆటంకముకలుగకుండా సృష్టించగలుగు సామర్థ్యమును అందించును. వాస్తవ పరికరమునకు వొక మార్పు చేయగనే (మూలం) స్నాప్‌షాట్ తీసుకొన్న తర్వాత, స్నాప్‌షాట్ సౌలభ్యము మార్చిన డాటా యేరియా యొక్క నకలును చేయును మార్పుకు ముందుగా వున్నప్పటిది అలా అది పరికరము యొక్క స్థితిని తిరిగి నిర్మించగలదు. మిర్రర్డ్ లాజికల్ వాల్యూమ్ యొక్క స్నాప్‌షాట్‌ను తీయగల సామర్థ్యమును Red Hat Enterprise Linux 6 పరిచయం చేయుచున్నది.
4.3.1.2. స్నాప్‌షాట్లను మిళితంచేయుట
Red Hat Enterprise Linux 6 అనునది లాజికల్ వాల్యూమ్ యొక్క స్నాప్‌షాట్‌ను మూలమైన లాజికల్ వాల్యూమ్‌తో మిళితం చేసే సామర్థ్యాన్ని యిస్తోంది. ఏదేని లాజికల్ వాల్యూమ్‌పై యెదురైన మార్పులనైనా తిరిగి స్నాప్‌షాట్ ద్వారా నిల్వవుంచబడిన బిందువుకు మిళితం చేయుట ద్వారా నిర్వహణాధికారులు తిరిగివుంచగలరు.
కొత్త స్నాప్‌షాట్ మెర్జ్ సౌలభ్యము గురించి మరింత సమాచారము కొరకు, lvconvert మాన్‌పేజ్ చూడండి.
4.3.1.3. ఫోర్-వాల్యూమ్ మిర్రర్స్
Red Hat Enterprise Linux 6 నందలి LVM అనునది లాజికల్ వాల్యూమ్‌ను నాలుగు మిర్రర్సుతో సృష్టించుటకు మద్దతించుచున్నది.
4.3.1.4. మిర్రర్ లాగ్‌లను మిర్రర్ చేయుట
LVM అనునది చిన్న లాగ్ (వేరే పరికరముపై) నిర్వహించును అది యే ప్రాంతములు మిర్రర్ లేదా మిర్రర్సుతో సింక్‌లో వున్నాయి అనేదాని గురించి సమాచారమును పోందుపరచును. Red Hat Enterprise Linux 6 అనునది ఈ లాగ్ పరికరమును మిర్రర్ చేయు సామర్థ్యాన్నిచ్చును.
4.3.2. LVM అప్లికేషన్ లైబ్రరీ
Red Hat Enterprise Linux 6 అనునది కొత్త LVM అప్లికేషన్ లైబ్రరీను (lvm2app) అందించును, LVM ఆధార నిల్వ నిర్వహణ అనువర్తనముల యొక్క అభివృద్దిని అనుమతించును.
5. పవర్ నిర్వహణ
ఇకపై చదువుటకు
పవర్ నిర్వహణ మార్గదర్శిని అనునది Red Hat Enterprise Linux 6 పైన పవర్ వినియోగాన్ని సమర్ధవంతంగా నిర్వహించుటకు సమాచారమును అందించును.
5.1. powertop
Red Hat Enterprise Linux 6 నందలి టిక్‌లెస్ కెర్నల్ యొక్క పరిచయం (Section 12.4.2, “టిక్‌లెస్ కెర్నల్” చూడండి) CPUను అతి తరచుగా ఖాళీ స్థితికి వెళ్ళుటకు అనుమతించును, పవర్ వినియోగాన్ని తగ్గించును మరియు పవర్ నిర్వహమను మెరుగుపరచును. కొత్త powertop సాధనము కెర్నల్ యొక్క ఫలనా మూలకములను గుర్తించు సమర్ధతను అందించును మరియు CPUను తరుచుగా మేల్కొలిపే యూజర్‌స్పేస్ అనువర్తనములను గుర్తించ గలదు. ఈ విడుదల నందలి చాలా అనువర్తనముల గుర్తించుటకు మరియు ట్యూన్ చేయుటకు powertop ఆభివృద్ది నందు వుపయోగించినారు, అనవసరపు CPU మేల్కొలుపును 10 గుణకంగా తగ్గించినారు.
5.2. ట్యూన్‌డ్
tuned అనునది సిస్టమ్ ట్యూనింగ్ డెమోన్ అది సిస్టమ్ మూలకములను పర్యవేక్షించును మరియు సిస్టమ్ అమరికలను గతికంగా ట్యూన్ చేయును. ktune (సిస్టమ్ ట్యూనింగ్ కొరకు స్టాటిక్ మెకానిజం) వుపయోగించి, tuned పరికరములను పర్యవేక్షించ గలదు మరియు ట్యూన్ చేయగలదు (ఉ.దా. హార్డు డిస్క్ డ్రైవులు మరియు ఈథర్నెట్ పరికరములు). Red Hat Enterprise Linux 6 యింకా డిస్కు చర్యలను పర్యవేక్షించుటకు diskdevstat ను మరియు నెట్వర్క్ చర్యలను పర్యవేక్షించుటకు netdevstat ను పరిచయం చేస్తోంది.
6. ప్యాకేజీ నిర్వహణ
6.1. పటిష్ట ప్యాకేజి చెక్‌సమ్స్
RPM అనునది సైన్‌డ్ ప్యాకేజీల కొరకు మద్దతును స్ట్రాంగ్ హాషింగ్ అల్గార్దెమ్సు SHA-256 వంటివి వుపయోగించి అందించును తద్వారా ప్యాకేజీ సమైగ్రతను మరియు రక్షణను పెంచును. Red Hat Enterprise Linux 6 ప్యాకేజీలు పారదర్శకంగా XZ లాస్‌లెస్ కంప్రెషన్ లైబ్రరీ కుదించబడును, యేదైతే LZMA2 కుదింపు అల్గార్దెమ్‌ను మంచి కుదింపు కొరకు అభివృద్ది పరిచెనో (ప్యాకేజీ పరిమాణం తగ్గించును) మరియు వేగవంతంగా అన్‌పాక్ చేయును (RPMలు సంస్థాపించునప్పుడు). పటిష్ట ప్యాకేజీ చెక్‌సమ్స్ పై అధిక సమాచారము కొరకు డిప్లోయ్‌మెంట్ మార్గదర్శిని చూడండి.
6.2. ప్యాకేజ్‌కిట్ ప్యాకేజీ నిర్వాహిక
Red Hat అనునది ప్యాకేజీకిట్‌ను ప్యాకేజీల దర్శనం, నిర్వహణకు, నవీకరణ, సంస్థాపనకు మరియు నిర్మూలనకు అందించును, మరియు మీ సిస్టమ్‌కు సారూప్యమగు ప్యాకేజీ సమూహాలను అందించును, మరియు Yum రిపోజిటరీలనందు చేతనము చేయబడును. ప్యాకేజీకిట్ అనునది చాలా గ్రాఫికల్ యింటర్ఫేస్‌లను కలిగివుంది అది GNOME ప్యానల్ మెనూ నుండి తెరువగలము, లేదా ప్రకటన ప్రాంతమునుండి తెరువగలము, యెప్పుడైతే ప్యాకేజీ కిట్ నవీకరణలు అందుబాటులో వున్నయి అని మీకు తెలుపునో అప్పుడు. అదనంగా, ప్యాకేజీకిట్ అనునది త్వరిత రిపోజిటరీ చేతనమును మరియు అచేతనమును అనుమతించుము, వొక గ్రాఫికల్ మరియు సెర్చిబుల్ టాన్సాక్షన్ లాగ్‌ను అనుమతించును, మరియు పాలసీకిట్ సంకీర్ణమును అనుమతించును. ప్యాకేజీకిట్ పై మరింత సమాచారము డిప్లోయ్‌మెంట్ మార్గదర్శిని నందు అందుబాటులోవుంది.
6.3. Yum
దాని యొక్క ప్లగిన్ ఆకృతి ద్వారా, Yum అనునది కొత్త విస్తరిత మద్దతును వివిధ సామర్థ్యముల కొరకు అందించును అవి డెల్టా RPMలు (ప్రెస్టో ప్లగిన్ వుపయోగించి), RHN కమ్యునికేషన్ (rhnplugin), మరియు ఆడిటింగ్ మరియు అపాదీకరణ—లెక్కించిన అతితక్కువ-ఆక్రమణ(కనీసపు) నవీకరణల సంఖ్య - సిస్టమ్‌కు సంభందిత పరిష్కారములను మాత్రమే అందించును (రక్షణ ప్లగిన్).
Yum అనునది yum-config-manager సౌలబ్యముతో కుదా అందించబడును, యిది అన్ని అమరిత ఆకృతీకరణ ఐచ్చికముల గురించి సమాచారమును చూపును మరియు ప్రతి రిపోజిటరీ గురించి పారామితులను చూపును. Yum కు యికపై నవీకరణల గురించి సమాచారము డిప్లోయ్‌మెంట్ మార్గదర్శిని నందు అందుబాటులో వుంది.
7. క్లస్టరింగ్
క్లిష్టమైన వుత్పాదక సేవలకు విశ్వాసతను, సర్దుబాటును, మరియు అందుబాటును పెంచుటకు సంయుక్తంగా పనిచేసే బహుళ కంప్యూటర్లు (నోడ్లు)నే క్లస్టర్స్ అందురు. పనితనమునకు, అధిక-అందుబాటుకు, భార సమతుల్యమునకు, మరియు ఫైల్ భాగస్వామ్యమునకు వంటి వివిధ అవసరాలకు అధిక అందుబాటు అనునది Red Hat Enterprise Linux 6 వుపయోగించి వివిధ ఆకృతీకరణలనందు నియెగించవచ్చును.
ఇకపై చదువుట
క్లస్టర్ సూట్ సమీక్ష పత్రము Red Hat Enterprise Linux 6 కొరకు Red Hat క్లస్టర్ సూట్ యొక్క సమీక్షను అందించును. అదనంగా, అధిక అందుబాటు నిర్వహణ పత్రము Red Hat Enterprise Linux 6 కొరకు Red Hat క్లస్టర్ సిస్టమ్సు యొక్క ఆకృతీకరణను మరియు నిర్వహణను వివరించును.
7.1. Corosync క్లస్టర్ యింజన్
Red Hat Enterprise Linux 6 కోర్ క్లస్టర్ ఫంక్షనాలిటి కొరకు Corosync క్లస్టర్ యింజన్‌ను వుపయోగించును.
7.2. యూనిఫైడ్ లాగింగ్ ఆకృతీకరణ
ఆధిక అందుబాటు నియోగించిన వివిధ డెమోన్లు యిప్పుడు భాగస్వామ్య యూనిఫైడ్ లాగింగ్ ఆకృతీకరణను వుపయోగించును. ఇది నిర్వహణాధికారులు క్లస్టర్ ఆకృతీకరణ నందు వొకే ఆదేశము ద్వారా క్లస్టర్ సిస్టమ్ లాగ్‌లను చేతనము చేయుటకు, కాప్చర్ చేయుటకు అనుమతించును.
7.3. అధిక అందుబాటు నిర్వహణ
Conga అనునది Red Hat Enterprise Linux అధిక అందుబాటు కొరకు కేంద్రీకృత ఆకృతీకరణను మరియు నిర్వహణను అందించే సాఫ్టువేర్ మూలకముల యొక్క సమీకృత సమితి. Conga యొక్క ప్రాధమిక మూలకాలలో వొకటి luci, యిది వొక కంప్యూటర్‌పై నడుస్తూ బహుళ క్లస్టర్స్ మరియు కంప్యూటర్లతో సంప్రదించు వొక సర్వర్. Red Hat Enterprise Linux 6 వెబ్ యింటర్ఫేస్ అది luci తో యింటరాక్ట్ అవుట నమోదుకాబడింది.
7.4. సాధారణ అధిక అందుబాటు మెరుగుదలలు
పైన వివరించిన విశేషణములకు మరియు మెరుగుదలలకు అదనంగా, Red Hat Enterprise Linux 6 కొరకు యీ కింది విశేషణములు మరియు విస్తరింపులు క్లస్టరింగ్‌కు చేయబడెను.
ఇంటర్నెట్ ప్రొటోకాల్ వర్షన్ 6 (IPv6) కొరకు విస్తరిత మద్దతు
SCSI స్థిర నియోగపు ఫెన్సింగ్ మద్దతు ఆమోదించబడింది.
రక్షణ మార్గదర్శిని స్థానికంగా మరియు దూరస్థంగా దాడిని, దోపిడీని మరియు హానికారక చర్యలనుండి వర్కుస్టేషన్లను మరియు సర్వర్లను రక్షించుటకు విధానాలను వినియోగదారులకు మరియు నిర్వహణాధికారులకు తెలుపును.
8.1. సిస్టమ్ సెక్యూరిటి సర్వీసెస్ డెమోన్ (SSSD)
సిస్టమ్ సెక్యూరిటి సర్వీసెస్ డెమోన్ (SSSD) అనునది Red Hat Enterprise Linux 6 నందు కొత్త సౌలభ్యము అది గుర్తింపు మరియు ధృవీకరణము యొక్క కేంద్ర నిర్వహణ కొరకు సేవల సమితిని మెరుగుపరచును. గుర్తింపుల యొక్క స్థానిక క్యాచింగ్‌ను కేంద్రీకృత గుర్తింపు మరియు ధృవీకరణ అనునది చేతనము చేయును, సేవకకు అనుసంధానము ఆటంకపరచబడిన సందర్భములో కూడా వినియోగదారులను గుర్తించుటకు అనుమతించును. SSSD అనునది చాలా రకములైన గుర్తింపును మరియు ధృవీకరణ సేవలను మద్దతించును, వాటిలో: Red Hat డైరెక్టరీ సర్వర్, ఏక్టివ్ డైరెక్టరి, OpenLDAP, 389, కెర్బరోస్ మరియు LDAP.
ఇకపై చదువుటకు
డిప్లోయ్‌మెంట్ మార్గదర్శిని అనునది సిస్టమ్ సెక్యూరిటి సర్వీసెస్ డెమెన్ (SSSD) యెలా సంస్థాపించాలి మరియు ఆకృతీకరించాలి అనే విభాగాన్ని కలిగివుంది, మరియు అది అందించే సౌలభ్యాలను యెలా వుపయోగించాలో కూడా తెలుపును.
8.2. నెక్యూరిటి-ఎన్హాన్సుడ్ లైనక్స్ (SELinux)
సెక్యూరిటి-ఎన్హాన్సుడ్ లైనక్స్ (SELinux) అనునది లైనక్స్ కెర్నల్‌నకు మాండెటరీ యేక్సెస్ కంట్రోల్ (MAC) జతచేయును, Red Hat Enterprise Linux 6 నందు అప్రమేయంగా చేతనము చేయబడును. ఒక సాధారణ ప్రయోజన MAC ఆకృతికి administratively-set రక్షణ విధానాన్ని అన్ని క్రమణములపైన మరియు సిస్టమ్ నందలి ఫైళ్ళపైన ఎన్వఫోర్స్ చేయుటకు సామర్థ్యం కావాలి, లేబుళ్ళపైన నిర్ణయాలు వైవిధ్య రక్షణ-సంభంద సమాచారమును కలిగివుండును.
8.2.1. నిర్భందిత వినియోగదారులు
సాప్రదాయంగా, SELinux అనునది వొక అనువర్తనము సిస్టమ్‌తో యెలా యింటరాక్ట్ అగును అనునది నిర్వచించుటకు మరియు నియంత్రించుటకు వుపయోగించబడును. Red Hat Enterprise Linux 6 నందలి SELinux కొన్ని విధానాలను పరిచయం చేయును వాటితో నిర్వహణాధికారులు ఏఏ వినియోగదారులు సిస్టమ్ యాక్సెస్ కలిగివుండాలో నియంత్రణ చేయగలుగుతారు.
8.2.2. సాండ్‌బాక్స్
Red Hat Enterprise Linux 6 నందలి SELinux కొత్త రక్షణ సాండ్‌బాక్స్ విశేషణాన్ని అందించును. రక్షణ సాండ్‌బాక్స్ కొన్ని SELinux విధానాలను జతచేయును అవి నిర్వహణాధికారులు ఏ అనువర్తనమునైనా పటిష్టంగా నిర్బందించిన SELinux డొమైన్‌నందు నడుపగలుగునట్లు చేయును. సాండ్‌బాక్స్ వుపయోగించి, సిస్టమ్ నిర్వహణాధికారులు సిస్టమ్ ను పాడుచేయకుండా నమ్మలేని విషయసంగ్రహం యొక్క ప్రోసెసింగ్‌ను పరిశీలించగలరు.
8.2.3. X ఏక్సెస్ కంట్రోల్ ఎక్సుటెన్షన్ (XACE)
X విండో సిస్టమ్ (సాధారణంగా "X" గా పిలువబడును) అనునది గ్రాఫికల్ యూజర్ యింటర్ఫేస్ (GUI) ను Red Hat Enterprise Linux 6 పై ప్రదర్శించుటకు ప్రాధమిక ఫ్రేమ్‌వర్కును అందించును. ఈ విడుదల కొత్త X ఏక్సెస్ కంట్రోల్ ఎక్సుటెన్షన్ (XACE) అందిస్తోంది, ఇది SELinux ను X నందు చేసిన నిర్ణయాలను యాక్సెస్ చేయనిస్తుంది, ప్రత్యేకించి, విండో ఆబ్జక్టు మద్యన నియంత్రణ సమాచారమును.
8.3. ఎన్క్రిప్టెడ్ నిల్వ పరికరముల కొరకు బ్యాకప్ సంకేతపదములు
Red Hat Enterprise Linux అనునది డాటాను నిల్వ పరికరములపై యెన్క్రిప్టు చేయుటకు సామర్ధ్యమును అందించును, డాటాను అనధికారికంగా యాక్సెస్ చేయుటను నిరోధించుట నుండి సహాయపడును. ఎన్క్రిప్షన్ అనునది డాటాను ఎన్క్రిప్షన్ కీ వుపయోగించి మాత్రమే చదువగల ఫార్మాట్ లోనికి బదిలీచేయును. ఈ కీ — సంస్థాపనా సమయమునందు సృష్టించిన కీ, మరియు సంకేతపదముచేత రక్షించబడును — ఎన్క్రిప్టెడ్ డాటాను డీక్రిప్టు చేయుటకు యిది మాత్రమే మార్గము.
Figure 7. డాటాను డీక్రిప్టు చేయుట
ఏమైనప్పటికి, సంకేతపదము అనునది తప్పుగా యిస్తే, ఎన్క్రిప్షన్ వుపయోగించలేము, ఎన్క్రిప్టెడ్ నిల్వ పరికరమునందలి డాటా యాక్సెస్ కాబడదు.
Red Hat Enterprise Linux 6 ఎన్క్రిప్షన్ కీలను దాచే మరియు బ్యాకప్ సంకేతపదములను సృష్టించే సామర్ధ్యమును యిచ్చును. ఈ సౌలభ్యము ఎన్క్రిప్టెడ్ వాల్యూమ్ యొక్క రికవరీకు అనుమతించును (root పరికరముతో సహా) వాస్తవ సంకేతపదము లేని సందర్బములో కూడా.
8.4. sVirt
libvirt అనునది C భాష అప్లికేషన్ ప్రోగ్రామింగ్ యింటర్ఫేస్ (API) యిది Red Hat Enterprise Linux 6 యొక్క వర్చ్యులైజేషన్ సామర్థ్యాలను నిర్వహించుటకు మరియు సంప్రదించుటకు. ఈ విడదలనందు, libvirt కొత్త sVirt మూలకాన్ని అందిస్తోంది. sVirt అనునది SELinuxతో కలిసి, వర్చ్యులైజ్డు వాతావరణంనందు గెస్టులను మరియు హోస్టులను అనధికారింగా యాక్సెస్ చేయుటనుండి నిరోధించుటకు రక్షణ సాంకేతికతలను అందించును.
8.5. ఎంటర్‌ప్రైజ్ సెక్యూరిటీ క్లైంట్
ఎంటర్‌ప్రైజ్ సెక్యూరిటి క్లైంట్ (ESC) అనునది సరళమైన GUI అది Red Hat Enterprise Linuxను స్మార్ట్ కార్డ్స్ మరియు టోకెన్లను నిర్వహించుటకు అనుమతించును. కొత్త స్మార్ట్ కార్డ్స్ ఫార్మాట్ చేయగలము మరియు ఎన్‌రోల్ చేయగలము, కొత్త కీలు సృష్టించబడును మరియు స్మార్ట్ కార్డ్ ద్వారా అభ్యర్ధించబడిన ధృవీకరణ పత్రములు స్వయంచాలనంగా సృష్టించబడును. స్మార్ట్ కార్డ్ జీవితచక్రం నిర్వచగలము, పోయిన స్మార్ట్ కార్డ్స్ వాటి దృవీకరణపత్రములను కోల్పోవును మరియు కాలముతీరిన దృవీకరణపత్రములు తరిగి పొడిగించబడును. ESC అనునది పెద్ద పబ్లిక్-కీ యిన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ వుత్పత్తి సంయోగంతో పనిచేయును, లేదా Red Hat Certificate System లేదా Dogtag PKI తో పనిచేయును.
9. నెట్వర్కింగ్
9.1. మల్టీక్యూయీ నెట్వర్కింగ్
నెట్వర్కు పరికరము నందు బదిలీ చేయబడు ప్రతి డాటా పాకెట్ CPU ద్వారా పూర్తికావలసిన క్రమణమును తెలుపును. Red Hat Enterprise Linux 6 నందలి లో-లెవల్ నెట్వర్కు అభివృద్ది అనునది నెట్వర్కు పరికర డ్రైవర్లు నెట్వర్కు పాకెట్ యొక్క క్రమణమును బహుళ క్యూలుగా విభజించుటకు అనుమతించును. ఈ కార్యక్రమములను విభజించుట వలన నవీన సిస్టమ్సు నందలి బహుళ క్రమణిలను మరియు CPU కోర్‌లను మంచిగా వుపయోగించగలగుతుంది.
9.2. ఇంటర్నెట్ ప్రొటోకాల్ వర్షన్ 6 (IPv6)
తరువాతి-తరం ఇంటర్నెట్ ప్రొటోకాల్ వర్షన్ 6 (IPv6) విశదీకరణ అనునది ఇంటర్నెట్ ప్రొటోకాల్ వర్షన్ 4 (IPv4)కు తరువాతది. IPv6 అనునది IPv4 పైన విస్తృత స్థాయి మెరుగుదలలను తెలుపును, వాటిలో: విస్తరిత చిరునామా సామర్ధ్యాలు, ఫ్లో లేబిలింగ్ మరియు సింప్లిఫైడ్ హెడర్ ఫార్మాట్స్ అనునది కొన్ని.
9.2.1. ఆప్టిమిస్టిక్ డూప్లికేట్ అడ్రస్ డిటెక్షన్
డూప్లికేట్ అడ్రస్ డిటెక్షన్ (DAD) అనునది IPv6 యొక్క నైబర్ డిస్కవరి ప్రొటోకాల్ పోర్షన్ యొక్క విశేషణము. ప్రత్యేకించి, DAD అనునది పరిశీలనతో కర్తవ్యీకరించబడెను వొకవేళ IPv6 యిప్పటికే వుపయోగించబడుచుంటే. Red Hat Enterprise Linux అనునది ఆప్టిమిస్టిక్ డూప్లికే అడ్రస్ డిటెక్షన్ అందించును, DAD యొక్క వొక వేగవంతమైన ఆప్టిమైజేషన్.
Red Hat Enterprise Linux 6 అనునది యింట్రా-సైట్ ఆటోమేటిక్ టన్నెల్ అడ్రసింగ్ ప్రొటోకాల్ (ISATAP) కు మద్దతును అందించును. ISATAP అనునది వొక ప్రొటోకాల్ అది IPv4 నుండి IPv6 బదిలీకరణనందు రూపొందించబడెను, IPv4 నెట్వర్కు ఆకృతి నంద హోస్ట్ కావుటకు మరియు IPv6 రూటర్లకు అనుసంధానం కావుటకు సాంకేతికతను అందించును.
9.3. నెట్‌లేబుల్
Netlabel అనునది Red Hat Enterprise Linux 6 నందు కొత్త కెర్నల్-లెవల్ విశేషణము అది నెట్వర్కు పాకెట్ లేబులింగ్ సేవలను లైనక్స్ సెక్యూరిటి మాడ్యూళ్ళు (LSMల) కొరకు అందించును. లోనికి వచ్చు నెట్వర్కు ప్యాకెట్లపై మంచి రక్షణ అవసరములను ఆపాదించుటకు, డాటా ప్యాకెట్స్ లెబులింగ్ LSM ను అనుమతించును.
9.4. జనరిక్ రిసీవ్ ఆఫ్‌లోడ్
Red Hat Enterprise Linux 6 నందలి లో-లెవల్ నెట్వర్క్ అభివృద్ది అనునది జనరిక్ రిసీవ్ ఆఫ్‌లోడ్ (GRO) మద్దతును అందించును. GRO సిస్టమ్ అనునది యిన్‌బౌండ్ నెట్వర్కు అనుసంధానముల యొక్క పనితనమును CPU ద్వారా జరిగిన ప్రోసెసింగ్ యొక్క మొత్తమును తగ్గించుట ద్వారా పెంచును. GRO లార్జ్ రిసీవ్ ఆఫ్‌లోడ్ (LRO) సిస్టమ్ వలె అదే సాంకేతికతను అభివృద్దిపరచును, అయితే ట్రాన్సుపోర్టు లేయర్ ప్రొటోకాల్స్ యొక్క విస్తృత స్థాయికి ఆపాదించవచ్చును.
9.5. వైర్‌లెస్ మద్దతు
Red Hat Enterprise Linux 6 అనునది వైర్‌లెస్ నెట్వర్కింగ్ మరియు పరికరముల కొరకు విస్తరిత మద్దతును కలిగివుండును. IEEE 802.11 ప్రమాణాల సమితిని వుపయోగించి వైర్‌లెస్ లోకల్ యేరియా నెట్వర్కింగ్ కొరకు మద్దతు మెరుగుపరచబడింది, 802.11n ఆధారిత వైర్‌లెస్ నెట్వర్కింగ్‌కు జతచేసిన మద్దతుతో.
10. డెస్కుటాప్
10.1. గ్రాఫికల్ ప్రారంభం
హార్డువేర్ ఆరంభించబడగానే తక్షణమే వచ్చే, కొత్త గ్రాఫికల్ బూట్ సీక్వెన్సును Red Hat Enterprise Linux 6 యిప్పుడు పరిచయం చేస్తోంది.
Figure 8. గ్రాఫికల్ బూట్ స్క్రీన్
కొత్త గ్రాఫికల్ బూట్ సీక్వెన్సు అనునది వినియోగదారికి సిస్టమ్ బూట్ యొక్క కార్యక్రమముపైన స్పందనను దృశ్యనీయంగా తెలుపును, మరియు లాగిన్ స్క్రీన్‌కు మారును. Red Hat Enterprise Linux 6 గ్రాఫికల్ బూట్ సీక్వెన్స్ అనునది కెర్నల్ మాడ్‌సెట్టింగ్ విశేషణము ద్వారా చేతనము చేయబడును మరియు ATI, Intel మరియు NVIDIA గ్రాఫిక్స్ హార్డువేర్ పైన కనబడును.
Note
గ్రాఫికల్ బూట్ సమయంలో యెప్పుడైనా F11 కీను వత్తుట ద్వారా సిస్టమ్ నిర్వహాకులు బూట్ సీక్వెన్స్ యొక్క పురోగతిని వివరంగా చూడగలరు.
10.2. అర్ధాంతరంగానిలిపివేయి మరియు కొనసాగించు
మిషన్‌ను తక్కువ పవర్ స్థితినందు వుంచుటకు మరియు తిరిగి యధాస్థానమునకు తెచ్చుటకు యిప్పుడు Red Hat Enterprise Linux నందు అర్ధాంతరంగానిలిపివేయి మరియు కొనసాగించు అనునది ప్రస్తుత విశేషణము. కెర్నల్ కొత్త మాడ్‌సెట్టింగ్ విశేషణము అనునది అర్ధాంతరంగానిలిపివేయి మరియు కొనసాగించు అను విశేషణము కొరకు విస్తరిత మద్దతును చేతనపరచును. గతంలో, గ్రాఫిక్స్ హార్డువేర్ అనునది యూజర్‌స్పేస్ అనువర్తనముల ద్వారా అర్ధాంతరంగానిలిపియుట మరియు కొనసాగించుట అనునది జరిగేది. Red Hat Enterprise Linux 6 నందు, ఈ ఫంక్షనాలిటి కెర్నల్‌కు కదల్చబడెను, తక్కువ పవర్ స్థితికి మరింత నమ్మికైన మెకానిజంను అందించును.
10.3. బహుళ పదర్శన మద్దతు
బహుళ పదర్శనలను కలిగివున్న వర్కుస్టేషన్ల కొరకు Red Hat Enterprise Linux 6 విస్తరిత మద్దతును అందించును. అదనపు ప్రదర్శన అనునది మిషన్‌కు అనుసంధానించబడగానే, గ్రాఫిక్స్ డ్రైవర్ దానిని స్వయంచాలకంగా గుర్తించి దానిని డెస్కుటాప్‌కు జతపరచును. అలాగే, ప్రదర్శన తీసివేయగానే, గ్రాఫిక్స్ డ్రైవర్ స్వయంచాలకంగా దానిని డెస్కుటాప్ నుండి తీసివేయును.
Note
అప్రమేయంగా, అదనపు ప్రదర్శన అనునది స్పానింగ్ లేవుట్ నందు ప్రస్తుత ప్రదర్శనకు ఎడమవైపున జతచేయబడును.
అదనపు ప్రదర్శనల యొక్క స్వయంచాలన గుర్తింపు అనునది ప్రదర్శనలు తరచుగా జతచేయుట మరియు తీసివేయుట జరుగు చోట వుపయోగకరంగా వుండును (ఉ.దా. బహిర్గత ప్రొజెక్టర్‌తో లాప్‌టాప్‌ను అమర్చుట)
10.3.1. ప్రదర్శన అభీష్టములు
కొత్త ప్రదర్శన అభీష్టాల డైలాగ్ అనునది బహుళ ప్రదర్శన నమూనాలను యింకా మలచుకొను సామర్ధ్యాన్నిచ్చును.
Figure 9. ప్రదర్శన అభీష్టాల డైలాగ్
ప్రస్తుతం మిషన్‌కు అనుబందించబడివున్న ప్రతి స్వతంత్ర ప్రదర్శన కొరకు స్థానీకరణ, రిజొల్యూషన్, రీఫ్రెష్ రేట్ మరియు భ్రమణపు అమరికలను సత్వరమే మార్చగలుగు సామర్థ్యమును కొత్త డైలాగ్ అందించును.
10.4. NVIDIA గ్రాఫిక్స్ పరికరముల కొరకు nouveau డ్రైవర్
NVIDIA GeForce 200 సీరీస్‌తో కలుపుకొని వాటివరకు గల NVIDIA గ్రాఫిక్స్ పరికరములకు Red Hat Enterprise Linux 6 కొత్త nouveau డ్రైవర్‌ను అప్రమేయంగా అందించును. nouveau అనునది 2D మరియు సాఫ్టువేర్ వీడియో యాక్సెలరేషన్‌ను మరియు కెర్నల్ మాడ్‌సెట్టింగ్‌ను మద్దతించును.
Note
NVIDIA హార్డువేరు (nv) కొరకు గత అప్రమేయ డ్రైవర్ యింకా Red Hat Enterprise Linux 6 నందు అందుబాటులో వుంది.
10.5. ఇంటర్నేష్నలైజేషన్
10.5.1. IBus
Red Hat Enterprise Linux 6 అనునది ఇంటిలిజంట్ యిన్పుట్ బస్ (IBus)ను అప్రమేయ యిన్పుట్ మెథడ్ ఫ్రేమ్‌వర్కు వలె యేసియన్ భాషల కొరకు పరిచయం చేస్తోంది.
10.5.2. ఇన్పుట్ పద్దతులను యెంచుకొనుట మరియు ఆకృతీకరించుట
Red Hat Enterprise Linux 6 im-chooser కలిగివుండును, ఇది యిన్పుట్ పద్దతులను చేతనము చేయుటకు మరియు ఆకృతీకరించుటకు వొక గ్రాఫికల్ యూజర్ యింటర్ఫేస్. im-chooser (యిది ముఖ్యమెనూ నందలి సిస్టమ్ > అభీష్టాలు > ఇన్పుట్ పద్దతి కిందన వుండును) అనునది వినియోగదారి సిస్టమ్ నందలి యిన్పుట్ పద్దతులను సులువుగా చేతనము చేయుటకు మరియు ఆకృతీకరించుటకు అనుమతించును.
10.5.3. ఇండిక్ ఆన్‌స్క్రీన్ కీబోర్డు
కొత్త ఇండిక్ ఆన్‌స్క్రీన్ కీబోర్డు (iok) అనునది యిండిక్ భాషల కొరకు స్క్రీన్ ఆధారిత వర్చ్యువల్ కీబోర్డ్, ఇన్‌స్క్రిప్ట్ కీమాప్ లేవుట్ మరియు యితర 1:1 కీ మాపింగ్స్ వుపయోగించి యిన్పుట్‌ను చేతనపరచును.
10.5.4. ఇండిక్ కొలేషన్ మద్దతు
Red Hat Enterprise Linux 6 అనునది భారతీయ భాషల కొరకు మెరుగైన క్రమీకరణ విధానాన్ని కలిగివుంది. మెనూలు మరియు యితర యింటర్ఫేస్ మూలకముల యొక్క క్రమము యిప్పుడు భారతీయ భాషల యందు సరిగా క్రమీకరించబడును.
10.5.5. ఫాంట్లు
Red Hat Enterprise Linux 6 నందు ఫాంట్ మద్దతు అనునది మెరుగుపరచబడెను, చైనీస్, జపనీస్, కొరియన్, భారతీయ మరియు థాయ్ భాషల కొరకు నవీకరణలను కలిగివుంది.
10.6. అనువర్తనములు
Red Hat Enterprise Linux 6 డెస్కుటాప్ పైని చాలావరకు అనువర్తనములు నవీకరించబడెను. ఈ కింది విభాగము ముఖ్యంగా గుర్తించవలసిన నవీకరణలను పత్రికీకరణ చేయును.
10.6.1. ఫైర్‌ఫాక్స్
Red Hat Enterprise Linux 6 అనునది మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వెబ్ బ్రౌజర్ యొక్క వర్షన్ 3.5ను యిస్తోంది.
Red Hat Enterprise Linux 6 మెజిల్లా థండర్‌బర్డ్ ఈమెయిల్ క్లైంట్ యొక్క వర్షన్ 3ను యిస్తోంది, యిది టాబ్‌డ్ సందేశీకరణను, స్మార్ట్ ఫోల్డర్సును, మరియు సందేశ ఆర్చీవ్‌ను అందించును. థండర్‌బర్డ్ 3 నందలి కొత్త విశేషణములపై యింకా సమాచారము కొరకు, థండర్‌బర్డ్ విడుదల నోట్స్ చూడండి.
10.6.3. OpenOffice.org 3.1
Red Hat Enterprise Linux 6 అనునది OpenOffice.org 3.1ను అందించును, విస్తృత రీతిలో ఫైల్ ఫార్మాట్లను చదువుటకు మద్దతును జతచేయును, వీటిలో Microsoft Office OOXML ఫార్మాట్ కూడా వుంది. అదనంగా, OpenOffice.org ఫైల్ లాకింగ్ మద్దతును మెరుగుపరచినది మరియు యాంటీ-ఎలియాసింగ్ వుపయోగించి గ్రాఫిక్సును రెండర్ చేయగల సామర్థ్యమును కలిగివుంది.
Figure 10. OpenOffice.org 3.1
OpenOffice.org యొక్క యీ వర్షన్ నందలి అన్ని విశేషణములపై పూర్తి వివరములు OpenOffice.org విడుదల నోట్స్ నందు అందుబాటులో వున్నాయి.
10.7. నెట్వర్కుమెనేజర్
నెట్వర్కుమేనేజర్ అనునది డెస్కుటాప్ సాధనము అది విస్తృత నెట్వర్కు అనుసంధాన రకములను అమర్చుటకు, ఆకృతీకరించుటకు మరియు నిర్వహించుటకు వుపయోగించబడును.
Figure 11. నెట్వర్కుమెనేజర్
Red Hat Enterprise Linux 6 నందు నెట్వర్కుమేనేజర్ మొబైల్ బ్రాడ్‌బాండ్ పరికరముల కొరకు విస్తరిత మద్దతును అందించును, బ్లూటూత్ పర్సనల్ యేరియా నెట్వర్క్ (PAN) పరికరముల కొరకు IPv6 మరియు జతకూడిన మద్దతును అందించును.
10.8. KDE 4.3
Red Hat Enterprise Linux 6 అనునది KDE 4.3 ను ప్రత్యామ్నాయ డెస్కుటాప్ యెన్విరాన్మెంట్ వలె అందించును.
KDE 4.3 మొత్తంగా వొక కొత్త వినియోగదారి అనుభవాన్ని యిస్తోంది, వీటిని అందిస్తోంది:
డెస్కుటాప్ మరింతగా మలచుకొనుట కొరకు కొత్త ప్లాస్మా డెస్కుటాప్ వర్కుస్పేస్, ప్లాస్మా విడ్జట్లతో కలుపుకొని.
ఆక్సిజన్, విస్తరిత ప్రతిమ మరియు సౌండ్ థీమ్‌లతో.
KDE విండో నిర్వాహిక (kwin) కొరకు విస్తరింపులు
అదనంగా, dolphin ఫైల్ బ్రౌజర్ అనునది KDE యొక్క అప్రమేయం అయిన konqueror స్థానాన్ని ఆక్రమించినది.
11. పత్రికీకరణ
Red Hat Enterprise Linux 6 కొరకు పత్రికీకరణ నందు 18 వేరువేరు పత్రములు యిమిడివున్నాయి. ఈ పత్రములనందలి ప్రతి వొక్కడి కింది వాటిలో వొకటి లేదా యెక్కువవాటికి చెందివుండును:
విడుదల పత్రికీకరణ
సంస్థాపన మరియు నియుక్తి(డిప్లోయ్‌మెంట్)
రక్షణ
సాధనములు మరియు పనితనము
క్లస్టరింగ్
వర్చ్యులైజేషన్
11.1. విడుదల పత్రికీకరణ
విడుదల నోడ్స్
విడుదల నోట్స్ అనునది Red Hat Enterprise Linux 6 నందలి ముఖ్యమైన కొత్త విశేషణములను పత్రికీకరణ చేయును.
సాంకేతిక నోట్స్
Red Hat Enterprise Linux సాంకేతిక నోట్స్ ఈ విడుదలకు సంభందించిన విశదీకృత సమాచారమును కలిగివుండును, దీనినందు: సాంకేతిక వుపదర్శనం, ప్యాకేజీ మార్పు వివరములు మరియు తెలిసిన సమస్యలు గురించికూడా వుండును.
మైగ్రేషన్ మార్గదర్శని
Red Hat Enterprise Linux మైగ్రేషన్ మార్గదర్శిని అనునది Red Hat Enterprise Linux 5 నుండి Red Hat Enterprise Linux 6కు మైగ్రేషన్‌ను పత్రికీకరణ చేయును.
11.2. సంస్థాపన మరియు నియుక్తి(డిప్లోయ్‌మెంట్)
సంస్థాపనా మార్గదర్శిని
సంస్థాపనా మార్గదర్శిని అనునది Red Hat Enterprise Linux 6 యొక్క సంస్థాపన గురించి సంభందిత సమాచారమును పత్రికీకరణచేయును.
డిప్లోయ్‌మెంట్ మార్గదర్శిని
డిప్లోయ్‌మెంట్ మార్గదర్శిని అనునది Red Hat Enterprise Linux 6 యొక్క డిప్లోయ్‌మెంట్,ఆకృతీకరణ మరియు నిర్వహణ గురించి సంభందిత సమాచారమును పత్రికీకరణ చేయును.
నిల్వ నిర్వహణ మార్గదర్శిని
నిల్వ నిర్వహణ మార్గదర్శిని అనునది Red Hat Enterprise Linux 6 పై నిల్వ పరికరములను మరియు ఫైల్ సిస్టమ్సును యెంత ప్రభవాశీలంగా నిర్వహించాలి అనేదానిపై సూచనలను అందించును. ఇది Red Hat Enterprise Linux లేదా Fedora పంపిణీల యొక్క లైనక్సుపై మద్యతరహా అనుభావాన్నైనా కలిగి వున్న సిస్టమ్ నిర్వహణాధికారులు వుపయోగించుటకు వుద్దేశించినది.
గ్లోబల్ ఫైల్ సిస్టమ్ 2
గ్లోబల్ ఫైల్ సిస్టమ్ 2 పుస్తకం అనునది Red Hat Enterprise Linux 6 కొరకు Red Hat GFS2 (Red Hat గ్లోబల్ ఫైల్ సిస్టమ్ 2)ను ఆకృతీకరించుట మరియు నిర్వహించుట గురించి సమాచారాన్ని అందించును.
లాజికల్ వాల్యూమ్ మేనేజర్ నిర్వహణాధికారి
The లాజికల్ వాల్యూమ్ మేనేజర్ నిర్వహణాధికారి పుస్తకం అనునది LVM లాజికల్ వాల్యూమ్ మేనేజర్ గురించి విశదీకరించును, యిది LVMను క్లస్టర్డ్ వాతావరణం నందు నడుపుటపై సమాచారమును కూడా అందించును.
11.3. రక్షణ
రక్షణ మార్గదర్శిని
స్థానికంగాను మరియు దూరస్థంగాను దాడులనుండి, దోపడీ మరియు హానికర చర్యలనుండి వర్కుస్టేషన్లను మరియు సేవికలను రక్షించే విధాలను తెలుసుకొనుటకు మరియు అవలంభించుటకు వినియోగదారుల మరియు నిర్వహణాధికారుల సహాయార్ధం రక్షణ మార్గదర్శిని రూపొందించబడింది.
SELinux వినియోగదారి మార్గదర్శిని
SELinux వినియోగదారి మార్గదర్శిని అనునది సెక్యూరిటీ-ఎన్‌హాన్సుడ్ లైనక్స్ యొక్క ఫ్రేమ్ వర్కుతో అనుభవం లేనివారి కొరకు దాని నిర్వహణ మరియు వినియోగించుటను తెలుపును. ఇది SELinuxకు పరిచయం లాగా పనికి వస్తుంది మరియు వినియోగంలో దాని షరతులను మరియు భావనలను తెలుపును.
నిషేధిత సేవలను నిర్వహించుట
నిషేధిత సేవలను నిర్వహించుట మార్గదర్శిని అనునది సెక్యూరిటి-ఎన్హాన్సుడ్ లైనక్స్(SELinux)ను వాడునప్పుడు మరియు ఆకృతీకరించునప్పుడు వినియోగదారుల మరియు నిర్వహాణాధికారుల సహాయార్ధం రూపొందించబడెను.ఇది Red Hat Enterprise Linux పై దృష్టిపెట్టును మరియు అనుభవజ్ఞుడైన వినియోగదారి లేదా నిర్వహణాధికారికి అవసరమగు SELinux సేవా సంభందిత మూలకముల గురించి వివరించును. SELinux వాటి ఆపరేషన్‌ను యెలా కాంప్లిమెంట్ చేయునో వివరించును మరియు ఈ సేవలను ఆకృతీకరించుటకు వాస్తవికమైన వుదాహరణలను చేర్చివుంచును.
11.4. సాధనములు మరియు పనితనము
రిసోర్స్ నిర్వహణా మార్గదర్శిని
రిసోర్స్ నిర్వహణా మార్గదర్శిని అనునది Red Hat Enterprise Linux 6 పై సిస్టమ్ వనరులను(రిసోర్సెస్) నిర్వహించుటకు సాధనములు మరియు సాంకేతికతలను పత్రికీకరణ చేయును.
పవర్ నిర్వహణా మార్గదర్శిని
పవర్ నిర్వహణా మార్గదర్శిని అనునది Red Hat Enterprise Linux 6 సిస్టమ్సుపై విద్యుత్(పవర్) వినియోగాన్ని యేలా ప్రభావవంతంగా నిర్వహించాలో వివరించును. ఈ పత్రము విద్యుత్ వినియోగం (సర్వర్ మరియు లాప్‌టాప్ రెంటికి) యెలా తగ్గించాలి అనేదానిపై వివిధ సాంకేతికతలను చర్చించినది, మరియు ప్రతి సాంకేతికత మొత్తము సిస్టమ్ యొక్క పనితనంపై యెలా ప్రభావితమౌతుంది అనేదానిపై కూడా చర్చించెను.
అభివృద్దికారి మర్గదర్శిని
అనువర్తనపు అభివృద్దినకు Red Hat Enterprise Linux 6 అనునది సరైన యెంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫాం అని తెలియజెప్పే విభిన్న విశేషణములు మరియు సౌలభ్యముల గురించి అభివృద్దికారి మార్గదర్శిని వివరించును.
క్లస్టర్ సూట్ సమీక్ష పత్రము Red Hat Enterprise Linux 6 కొరకు అధిక అందుబాటు యొక్క సమీక్షను అందించును.
అదిక అందుబాటు నిర్వహణ
అధిక అందుబాటు నిర్వహణ పత్రము Red Hat Enterprise Linux 6 కొరకు Red Hat అధిక అందుబాటు సిస్టమ్స్ యొక్క ఆకృతీకరణను మరియు నిర్వహణను వివరించును.
వర్చ్యువల్ సర్వర్ నిర్వహణ
వర్చ్యువల్ సర్వర్ నిర్వహణ పుస్తకం అనునది Red Hat Enterprise Linux 6 మరియు Linux Virtual Server (LVS) సిస్టమ్‌తో అధిక-పనితనపు సిస్టమ్స్ మరియు సేవల యొక్క ఆకృతీకరణను చర్చించును.
DM మల్టీపాత్
DM మల్టీపాత్ పుస్తకం అనునది Red Hat Enterprise Linux 6 యొక్క డివైజ్-మాపర్ మల్టీపాత్ విశేషణము వుపయోగించుటపై సమాచారాన్ని అందించును.
11.6. వర్చ్యులైజేషన్
వర్చ్యులైజేషన్ మార్గదర్శిని
వర్చ్యులైజేషన్ మార్గదర్శిని అనునది Red Hat Enterprise Linux 6 నందు వర్చ్యులైజేషన్ సాంకేతికపరిజ్ఞానాలను సంస్థాపించే, ఆకృతీకరించే మరియు నిర్వహించే విధానాన్ని వివరించును.
12. కెర్నల్
12.1. రిసోర్స్ నియంత్రణ
12.1.1. నియంత్రణ సమూహములు
Red Hat Enterprise Linux 6 నందు నియంత్రణ సమూహములు అనునవి లైనక్స్ కెర్నల్ యొక్క కొత్త విశేషణము. ప్రతి నియంత్రణ సమూహం అనునది కర్తవ్యముల యొక్క సమితి అది సిస్టమ్ హర్డువేర్‌తో వాటి వుత్తమ సాహచర్యం కొరకు ఆ సిస్టమ్‌పై వుండును. అవి వుపయోగిస్తున్న సిస్టమ్ వనరులను పర్యవేక్షించుటకు నియంత్రణ సమూహములు ట్రాక్ చేయబడగలవు. అదనంగా, సిస్టమ్ వనరులు అయినటువంటి మెమొరీ, CPUలు (లేదా CPUల యొక్క సమూహం), నెట్వర్కింగ్, I/O, లేదా ప్రణాళకికి కొన్ని నియంత్రణ సమూహల యాక్సెస్‌ను అనుమతించుటకు లేదా తిరస్కరించుటకు నిర్వహణాధికారులు నింయత్రణ సమూహ ఆకృతిని వుపయోగించుకో గలరు. యూజర్‌స్పేస్ నందు నియంత్రణ సమూహాల యొక్క నిర్వహణ అనునది libcgroup ద్వారా అందించబడును, కొత్త నియంత్రణ సమూహాలను సృష్టించుటకు, కొత్త కార్యక్రమాన్ని ప్రత్యేకమైన నియంత్రణ సమూహం నందు ప్రారంభించుటకు మరియు నియంత్రణ సమూహ పారామితులను అమర్చుటకు, సిస్టమ్ నిర్వహణాధికారులును చేతనపరచును.
Note
నియంత్రణ సమూహాలు మరియు యితర వనరు నిర్వహణా విశేషణములు Red Hat Enterprise Linux 6 వనరు నిర్వహణా మార్గదర్శిని నందు వివరంగా చర్చించబడెను
12.2. స్కేలబిలిటి
12.2.1. కంప్లీట్లీ ఫెయిర్ షెడ్యూలర్ (CFS)
ఒక క్రమణం (లేదా కర్తవ్య) ప్రణాళకి అనునది వొక ప్రత్యేక కెర్నల్ వుపవ్యవస్థ అది యే క్రమణములు CPUకు పంపబడాలి అనే క్రమమును యిచ్చుటకు భాద్యత వహించును. కెర్నల్ (వర్షన్ 2.6.32) అనునది Red Hat Enterprise Linux 6 నందు యీయబడెను O(1) ప్రణాళకిని కొత్త కంప్లీట్లీ ఫెయిర్ షెడ్యూలర్ (CFS) తో పునఃస్థాపించును. CFS అనునది ఫెయిర్ క్యూయింగ్ షెడ్యూలింగ్ అల్గార్దెమ్‌ను అభివృద్దిపరచును.
12.2.2. వర్చ్యువల్ మెమొరీ పేజ్‌అవుట్ స్కేలబిలిటి
కెర్నల్ ద్వారా అభివృద్దిపరచబడెను, వర్చ్యువల్ మెమొరీ అనువర్తనములకు వొంటరి, వరుస మెమొరీ బ్లాక్ చిరునామాలను యిచ్చును. ఈ సమర్పణ వెనుక వున్న వాస్తవం అనునది క్లిష్టమైనది, వాస్తవమైన భౌతిక చిరునామాలు సాధారణంగా విభజించబడును మరియు నిర్ధిష్ట డిస్కుల వంటి నిదానమైన పరికరములకు పేజ్‌డ్ అవుట్ చేయబడును. వర్చ్యువల్ మెమొరీ చిరునామాలు కెర్నల్ ద్వారా పేజీలు అని పిలువబడు ప్రామాణిక యూనిట్లకు నిర్వహించబడును. Red Hat Enterprise Linux 6 నందలి కెర్నల్ అనునది వర్చ్యువల్ మెమొరీ పేజీల యొక్క విస్తరిత నిర్వహణను అందించును, యిది ఎక్కువ మొత్తంలో భౌతిక మెమొరీ కలిగివున్న సిస్టమ్సుపై ప్రోసెసింగ్ భారమును తగ్గించుటద్వారా జరుగును.
12.3. దోష నివేదీకరణ
12.3.1. ఎడ్వాన్స్డ్ యెర్రర్ రిపోర్టింగ్ (AER)
Red Hat Enterprise Linux 6 నందలి కెర్నల్ ఎడ్వాన్స్డ్ యెర్రర్ రిపోర్టింగ్(AER) అందించును. AER అనునది కొత్త కెర్నల్ విశేషణము అది PCI-ఎక్సుప్రెస్ పరికరముల కొరకు విస్తరిత దోష నివేదీకరణను అందించును.
12.3.2. kdump స్వయంచాలన చేతనీకరణము
kdump యిప్పుడు పెద్ద మొత్తములో మెమొరీ వున్న సిస్టమ్సు నందు అప్రమేయంగా చేతనము చేయబడును. ప్రత్యేకింది, kdump అనునది అప్రమేయంగా వీటిపై చేతనముచేయబడను:
4KB పేజీ పరిమాణంతో (x86 లేదా x86_64) ఆకృతులపైన 4GB మెమొరీతో వున్న సిస్టమ్సుపై, లేదా
4KB పేజీ పరిమాణం కన్నా పెద్దదైన (PPC64) ఆకృతులపైన 8GB మెమొరీతో వున్న సిస్టమ్సుపైన.
12.4. పవర్ నిర్వహణ
12.4.1. ఏగ్రెస్సివ్ లింక్ పవర్ మేనేజ్‌మెంట్ (ALPM)
Red Hat Enterprise Linux 6 నందలి కెర్నల్ ఏగ్రెస్సివ్ లింక్ పవర్ మేనేజ్‌మెంట్ (ALPM) కొరకు మద్దతును అందించును. ALPM అనునది పవర్-ఆదా మెళుకువ అది డిస్కు పవర్‌ను ఆదా చేయునట్లు చేయును దానికొరకు ఖాళీ సమయమందు( అంటే యెటువంటి I/O లేనప్పుడు) SATA లింక్‌ను డిస్కునకు అమర్చును. I/O అభ్యర్ధనలు ఆ లింకునకు క్యూ కాబడగానే ALPM స్వయంచాలకంగా SATA లింకును క్రియాశీల పవర్ స్థితికి వుంచును.
12.4.2. టిక్‌లెస్ కెర్నల్
గతంలో కెర్నల్ వొక టైమర్‌ను అభివృద్ది పరిచేది అది యేమైనా కర్తవ్యములు నిర్వహించుటకు మిగిలివున్నాయేమో అని పరిశీలించుటకు సమయానుసారంగా సిస్టమ్‌ను అడిగేది. గనుక, CPU క్రియాశీల స్థితిలోనే వుండిపోయేది, అనవసరంగా పవర్ వినియోగమయ్యేది. Red Hat Enterprise Linux 6 నందలి కెర్నల్ కొత్త టిక్‌లెస్ కెర్నల్ విశేషణాన్ని కలిగివుంది, సమయానుసార టైమర్ ఆటంకములను అవసరమైనప్పటి ఆటంకములచే పునఃస్థాపించుచున్నది. ఖాళీగా వున్నప్పుడు CPU దీర్ఘ నిద్రావస్థ నందు ప్రవేశించుటకు టిక్‌లెస్ కెర్నల్ అనుమతించును, ఏదైనా కర్తవ్యము నిర్వహించవలసి వచ్చినప్పుడే మేల్కొలుపును.
12.5. కెర్నల్ పనితనమును విశ్లేషించుట
12.5.1. పర్ఫార్మెన్స్ కౌంటర్ ఫర్ లైనక్స్ (PCL)
లైనక్స్ పర్ఫార్మెన్స్ కౌంటర్ వ్యవస్థాపన అనునది పర్ఫార్మెన్స్ కౌంటర్ హార్డువేర్ సామర్థ్యముల యొక్క వివరణను యిచ్చును, నిర్వర్తించబడిన సూచనలు, తప్పిపోయిన క్యాచి, మరియు తప్పుగా-వూహించిన బ్రాంచెస్ మొదలగునవి. PCL అనునది పర్-టాస్క్ మరియు పర్-CPU లింక్కింపులను అందించును, ఈ లెక్కింపులపై ఈవెంట్ సామర్థ్యాలను జతచేయును. కెర్నల్ ఫంక్షన్లను మరియు ఘటనలను ప్రొఫైల్ చేయుటకు మరియు కెర్నల్ పర్ఫార్మెన్స్ సమస్యల యొక్క విశ్లేషణనందు సహాయపడుటకు పర్ఫార్మెన్స్ కౌంటర్ సమాచారము వుపయోగించగలము.
12.5.2. Ftrace మరియు perf
కెర్నల్ పనితనమును విశ్లేషించుటకు రెండు కొత్త సాధనములు Red Hat Enterprise Linux 6 నందు అందుబాటులో వున్నాయి. Ftrace అనునది కెర్నల్ కొరకు కాల్ గ్రాఫ్ తరహా ట్రేసింగ్‌ను అందించును. కొత్త perf సాధనము అనునది హార్డువేర్ ఘటనలను పర్యవేక్షించును, లాగ్ చేయును మరియు విశ్లేషించును.
12.6. సాధారణ కెర్నల్ నవీకరణలు
12.6.1. ఫిజకల్ అడ్రస్ ఎక్సుటెన్షన్ (PAE)
ఫజికల్ అడ్రస్ ఎక్సుటెన్షన్ (PAE) అనునది నవీన x86 క్రమణిలందు అభివృద్దిపరచిన సౌలభ్యము. PAE మెమొరీ అడ్రసింగ్ సామర్థ్యములను పొడిగించును, వుపయోగించుటకు 4 గిగాబైట్ల (GB) రాండమ్ యాక్సెస్ మెమొరీ (RAM) యెక్కువను అనుమతించును. Red Hat Enterprise Linux 6 యొక్క x86 ఆకృతి వర్షన్‌తో యీయబడిన అప్రమేయ కెర్నల్ PAE చేనమైంది. Red Hat Enterprise Linux 6 యొక్క x86 రకమునకు PAE చేతన క్రమణి అనునది కనీస అవసరము.
12.6.2. లోడుచేయదగిన ఫర్మువేర్ ఫైళ్ళు
సరైన లైసెన్సుడ్ సోర్స్ కోడ్ లేని ఫర్మువేర్ ఫైళ్ళు Red Hat Enterprise Linux 6 కెర్నల్ నుండి తీసివేయబడినాయి. లోడ్ చేయదగిన ఫర్మువేర్ కావలసిన మాడ్యూళ్ళు యూజర్‌స్పేస్ నుండి ఫర్మువేర్‌ను అభ్యర్దించుటకు యిప్పుడు కెర్నల్ యింటర్ఫేసును వుపయోగించుచున్నది.
13. కంపైలర్ మరియు సాధనములు
13.1. సిస్టమ్‌టాప్
సిస్టమ్‌టాప్ అనునది ట్రేసింగ్ మరియు ప్రోబింగ్ సాధనము అది వినియోగదారులు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క క్రియలను అధ్యయనం చేయుటకు మరియు పర్యవేక్షించుటకు అనుమతించును (ప్రత్యేకించి, కెర్నల్). ఇది netstat, ps, top, మరియు iostat వంటి సాధనముల అవుట్పుట్‌కు సమానమైన సమాచారాన్ని అందించును; ఏమైనప్పటికి, సేకరించిన సమాచారము కొరకు మరిన్ని ఫల్టరింగ్ మరియు విశ్లేషణ ఐచ్చికాలను అందించుటకు సిస్టమ్‌టాప్ రూపొందించబడెను.
Red Hat Enterprise Linux 6 అనునది సిస్టమ్‌టాప్ వర్షన్ 1.1ను అందించును, అది చాలా కొత్త విశేషణములను మరియు విస్తరింపులను అందించును, వీటితో కలిపి:
యూజర్-స్పేస్ ప్రోబింగ్ కొరకు మెరుగుపరచిన మద్దతు.
నేటివ్ C++ సిన్టాక్సుతో C++ ప్రోగ్రాములను ప్రోబ్ చేయుటకు మద్దతు.
ఒక మరింత సురక్షితమైన స్క్రిప్టు-కంపైలర్ సర్వర్.
కొత్త అనుమతిలేని రీతి, root-కాని వినియోగదారులు సిస్టమ్‌టాప్ వుపయోగించుటకు అనుమతించును.
Important
అనుమతిలేని రీతి అనునది కొత్తది మరియు ప్రయోగాత్మకం. ఇది ఆధారపడే stap-server సౌలభ్యము అనునది రక్షమ మెరుగుదలల కొరకు అభివృద్దిలో వుంది మరియు నమ్మదగిన నెట్వర్కుపై జాగ్రత్తగా నియోగించాలి.
13.2. OProfile
OProfile అనునది లైనక్స్ సిస్టమ్సు కొరకు సిస్టమ్-వైడ్ ప్రొఫైలర్. ప్రొఫైలింగ్ అనునది పారదర్శకంగా బ్యాక్‌గ్రౌండ్ నందు నడుచును మరియు ప్రొఫైల్ డాటా యే సమయం వద్దనైనా సేకరించగలము.
Red Hat Enterprise Linux 6 అనునది OProfile యొక్క వర్షన్ 0.9.5 అందించును, కొత్త Intel మరియు AMD ప్రోసెసర్స్‌కు మద్దతును జతచేయును.
13.3. GNU కంపైలర్ కలక్షన్ (GCC)
GNU కంపైలర్ కలక్షన్ (GCC) చేర్చబడెను, వీటితో కలిపి, C, C++, మరియు Java GNU కంపైలర్స్ మరియు సంభందిత మద్దతు లైబ్రరీలు. Red Hat Enterprise Linux 6 అనునది GCC యొక్క వర్షన్ 4.4ను అందించును, అది కింది విశేషణములను మరియు విస్తరింపులను కలిగివుంది:
ఓపెన్ మల్టీ-ప్రోసెసింగ్ (OpenMP) అప్లికేషన్ ప్రోగ్రామింగ్ యింటర్ఫేస్ (API) యొక్క వర్షన్ 3.0కు నిర్ధారణ.
OpenMP త్రెడ్సును వుపయోగించుటకు అదనపు C++ లైబ్రరీలు
ISO C++ ప్రామాణిక డ్రాఫ్ట్ (C++0x) యొక్క యికపై మెరుగుదలలు
GNU ప్రోజెక్ట్ డీబగ్గర్ (GDB) మరియు సిస్టమ్‌టాప్ వుపయోగించి డీబగ్గింగ్ మెరుగుపరచుటకు వేరియబుల్ ట్రాకింగ్ చేర్పుల యొక్క పరిచయం.
GCC 4.4 నందు అభివృద్దిపరచిన మెరుగదలల గురించి మరింత సమాచారము GCC వెబ్‌సైట్ నుండి అందుబాటులో వుంది.
13.4. GNU C లైబ్రరి (glibc)
GNU C లైబ్రరీ (glibc) ప్యాకేజీలు Red Hat Enterprise Linux పై బహుళ ప్రోగ్రాముల ద్వారా వుపయోగించు ప్రామాణిక C లైబ్రరీలను కలిగివుంటుంది. ఈ ప్యాకేజీలు ప్రామాణిక C మరియు ప్రామాణిక మాత్ లైబ్రరీలను కలిగివున్నాయి. ఈ రెండు లైబ్రరీలు లేకుండా, లైనక్స్ సిస్టమ్ సరిగా ఫంక్షన్ కాలేదు.
Red Hat Enterprise Linux 6 అనునది glibc యొక్క వర్షన్ 2.11ను అందించును, చాలా విశేషణములను మరియు విస్తరింపులను అందించును, వీటితో కలిపి:
ఒక విస్తరిత డైనమిక్ మెమొరీ ఎలొకేషన్ (malloc) ప్రవర్తన అనునది హైయర్ స్కేలబిలిటిని చాలా సాకెట్లు మరియు కోర్‌లనందు చేతనపరచును. ఇది త్రెడ్సును వాటి స్వంత మెమొరీ పూల్సునకు చేర్చుటద్వారా మరియు కొన్ని సందర్బములలో లాకింగ్‌ను తప్పించుట ద్వారా సాధించబడును. మెమొరీ పూల్స్ కొరకు వుపయోగించిన అదనపు మెమొరీ యొక్క మొత్తము అనునది యెన్విరాన్మెంట్ వేరియబుల్స్ MALLOC_ARENA_TEST మరియు MALLOC_ARENA_MAX వుపయోగించి నియంత్రించగలము. మెమొరీ పూల్స్ సంఖ్య ఈ విలువకు చేరిన తర్వాత కోర్స్ సంఖ్య కొరకు పరిశీలనను MALLOC_ARENA_TEST తెలుపును. MALLOC_ARENA_MAX అనునది గరిష్టంగా వుపయోగించు మెమొరీ పూల్స్ సంఖ్యను అమర్చును, కోర్స్ సంఖ్యతో సంభందలేకుండా.
PI ఫాస్ట్ యూజర్‌స్పేస్ మ్యూటెక్సెస్ కొరకు కెర్నల్ నందలి మద్దతును వుపయోగించుట ద్వారా ప్రియారిటి యిన్హర్టెన్స్ (PI) మ్యూచువల్ ఎక్సుక్లూజన్ (mutex) ఆపరేషన్లతో కండీషన్ వేరియబుల్స్ (condvars) వుపయోగించునప్పుడు సమర్ధతను మెరుగుపరచును.
x86_64 ఆకృతిపై ఆప్టిమైజ్డ్ స్ట్రింగ్ ఆపరేషన్లు.
getaddrinfo() ఫంక్షన్ యిప్పుడు డాటాగ్రామ్ కంజషన్ కంట్రోల్ ప్రోటోకాల్ (DCCP) మరియు UDP-Lite ప్రొటోకాల్ కొరకు మద్దతును కలిగివుంది. అదనంగా getaddrinfo() యిప్పుడు IPv4 మరియు IPv6 చిరునామాలను ఏకకాలంలో చూసుకోగల సామర్థ్యం కలిగివుంది.
13.5. GNU ప్రోజెక్ట్ డీబగ్గర్ (GDB)
GNU ప్రోజెక్ట్ డీబగ్గర్ (సాధారణంగా GDBగా పిలువబడును) C, C++, మరియు యితర భాషలనందు వ్రాసిన ప్రోగ్రాములను నియంత్రిత శైలిలో నిర్వర్తించుట ద్వారా డీబగ్ చేయును, అప్పుడు వాటి డాటాను ముంద్రించును. Red Hat Enterprise Linux 6, GDB యొక్క వర్షన్ 7.0 అందించును.
పైథాన్ స్క్రిప్టింగ్
GDB యొక్క ఈ నవీకరించిన వర్షన్ కొత్త పైథాన్ APIను పరిచయం చేస్తోంది, దీనికొరకు పైథాన్ ప్రోగ్రామింగ్ భాషనందు వ్రాసిన స్క్రిప్టులను వుపయోగించి GDB స్వయంచాలనంను అనుమతించును.
పైథాన్ API యొక్క వొక గమనించదగిన విశేషణము యేమిటంటే GDB అవుట్పుట్‌ను (pretty-printingగా పిలువబడును) పైథాన్ స్క్రిప్ట్సును వుపయోగించి ఫార్మాట్ చేయగల్గుట. గతంలో,GDB నందు pretty-printing అనునది ప్రామాణిక ముద్రణ అమరికలు వుపయోగించి ఆకృతీకరించేవారు. తగినట్లుగా pretty-printer స్క్రిప్టులను సృష్టించుకొనగల్గుట వలన కొన్ని అనువర్తనములకు GDB సమాచారమును ప్రదర్శించే తీరును వినియోగదారి నియంత్రించవచ్చును. Red Hat Enterprise Linux అనునది GNU Standard C++ Library కొరకు pretty-printer స్క్రిప్ట్సు యొక్క పూర్తి సూట్‌ను అందించును (libstdc++).
విస్తరిత C++ మద్దతు
GDB నందు C++ ప్రోగ్రామింగ్ భాషకు మద్దతు మెరుగుపరచబడింది. వీటిలో కొన్ని గమనించదగిన మెరుగుదలలు:
ఎక్సుప్రెషన్ పార్శింగ్ కొరకు చాలా మెరుగుదలలు.
టైప్ నామములను చక్కగా సంభాలించుట.
ఎక్సట్రానియస్ కోటింగ్ యొక్క అవసరం చాలావరకు తీసివేయబడింది
"తరువాత" మరియు యితర స్టెప్పింగ్ ఆదేశములు ఇన్ఫీరియర్ దోషమును యిచ్చినప్పుడుకూడా సరిగా పనిచేయుచున్నవి.
GDB కొత్త "catch syscall" ఆదేశము. ఇన్ఫీరియర్ సిస్టమ్ కాల్‌ను చేసినప్పుడు దానిని ఆపుటకు యిది వుపయోగించగలము.
స్వతంత్ర త్రెడ్ డీబగ్గింగ్
త్రెడ్ ఎగ్జక్యూషన్ అనునది యిప్పుడు త్రెడ్సును స్వతంత్రంగా మరియు వొంటరిగా వొకదానికొకటి డీబగ్ చేసుకొనుటకు అనుమతించును; కొత్త అమరికలను చేతనము చేయుట ద్వారా "set target-async" మరియు "set non-stop".
14. ఇంటరాపెరబిలిటి
14.1. సాంబా
సాంబా అనునది ప్రోగ్రాముల యొక్క సూటు అది NetBIOSను TCP/IP (NetBT) పై వుపయోగించి ఫైళ్ళ యొక్క భాగస్వామ్యమును, ముద్రికలను మరియు యితర సమాచారమును (అందుబాటులో ఫైళ్ళ మరియు ముద్రికల డైరెక్టరీలు వంటివి) చేతనము చేయును. ఈ ప్యాకేజీ సర్వర్ మెసేజ్ బ్లాక్‌ను లేదా SMB సర్వర్ (కామన్ యింటర్నెట్ ఫైల్ సిస్టమ్ లేదా CIFS సర్వర్‌గా కూడా తెలియును) అందించును యిది SMB/CIFS క్లైంట్లకు నెట్వర్కు సేవలను అందించును.
Red Hat Enterprise Linux 6 అనునది కింది చెప్పుకోదగ్గ విస్తరింపులను సాంబాకు చేసినది:
ఇంటర్నెట్ ప్రొటోకాల్ వర్షన్ 6 మద్దతు (IPv6)
Windows 2008 (R2) ట్రస్ట్ సంభందాలు కొరకు మద్దతు.
Windows 7 డొమైన్ సభ్యుల కొరకు మద్దతు.
ఏక్టివ్ డైరెక్టరి LDAP సైనింగ్/సీలింగ్ పాలసి కొరకు మద్దతు.
libsmbclient కొరకు మెరుగుదలలు
Windows నిర్వహణ సాధనములు (mmc మరియు వినియోగదారి నిర్వాహిక) కొరకు మంచి మద్దతు
డొమైన్ సభ్యుని వలె స్వయంచాలక మిషన్ సంకేతపదము
కొత్త రిజిస్ట్రీ ఆధారిత ఆకృతీకరణ లేయర్
సాంబా క్లైంట్ మరియు సర్వర్ మద్యన యెన్క్రిప్టెడ్ SMB బదిలీకరణ
Windows క్రాస్-ఫారెస్ట్, ట్రాన్సిటివ్ ట్రస్ట్స్ మరియు వన్-వే డొమైన్ ట్రస్ట్స్ కొరకు పూర్తి మద్దతు
కొత్త NetApi రిమోట్ నిర్వహణ మరియు winbind క్లైంట్ C లైబ్రరీలు
Windows డొమైన్లను జేరుటకు కొత్త గ్రాఫికల్ వినియోగదారి యింటర్ఫేస్
Red Hat Enterprise Linux 6 బీటా అనునది AMD64 మరియు Intel 64 ఆకృతులపై కెర్నల్-ఆధారిత వర్చ్యువల్ మిషన్ (KVM) హైపర్విజర్‌కు పూర్తి మద్దతును చేకూర్చును. KVM అనునది లైనక్స్ కెర్నల్‌కు ఏకీకృతం చేయబడెను, అది Red Hat Enterprise Linux నందలి స్థిరత్వము, విశేషణముల, మరియు హార్డువేరు మద్దతు యొక్క ప్రయోజనాలను తీసుకొని వర్చ్యువలైజేషన్ ప్లాట్‌ఫాంను అందిచును.
15.1.1. మెమొరీ విస్తరింపులు
పారదర్శక పెద్దపేజీలు మెమొరీ పేజీ పరిమాణమును 4 కిలోబైట్లనుండి 2 మెగాబైట్లకు పెంచెను. పారదర్శక పెద్ద పేజీలు అనునవి అధికంగా విషయసంగ్రహములను మరియు పెద్ద మెమొరీ పనిభారములను కలిగివున్న సిస్టమ్సు పైన స్పష్టమైన పనితనపు ప్రయోజనాలను అందివ్వగలవు. అదనంగా, Red Hat Enterprise Linux 6 అనునది పారదర్శక పెద్దపేజీలను KSMతో వుపయోగించుటకు మద్దతును అందించును.
ఎక్సుటెండెడ్ పేజ్ టేబుల్ ఏజ్ బిట్స్ అనునది హోస్టు మెమొరీ వత్తిడినందు మెమొరీను స్వాప్ చేయుటకు తెలివైన యెంపికలు చేయుటకు దోహదపడును మరియు విస్తరిత పేజీలను చిన్న పేజీలుగా విడగొట్టుట ద్వారా పారదర్శక పెద్దపేజీల యొక్క స్వాపింగ్‌ను అనుమతించును.
15.1.2. వర్చ్యులైజ్డు CPU విశేషణములు
Red Hat Enterprise Linux 6 అనునది వొంటరి వర్చ్యులైజ్డు గెస్టు కొరకు 64 వర్చ్యులైజ్డు CPUల వరకు మద్దతించును.
హోస్టు ప్రోసెసర్ పై వున్న CPU పొడిగింపులు యిప్పుడు వర్చ్యులైజ్డు గెస్టుల ద్వారా వుపయోగించబడును. ఈ సూచన సమితులకు గల మద్దతు అనునది వర్చ్యువల్ గెస్టులు నవీన ప్రోసెసర్ సూచన సమితుల మరియు హార్డువేర్ విశేషణముల ప్రయోజనాలను తీసుకోగల్గుటకు అనుమతించును.
కొత్త x2apic వర్చ్యువల్ అడ్వాన్సుడ్ ప్రోగ్రామబుల్ యింటరప్ట్ కంట్రోలర్ (APIC) అనునది ఎమ్యులేటెడ్ యాక్సెస్ యొక్క వోవర్‌హెడ్‌ను తీసివేయుట ద్వారా మరియు నేరుగా గెస్టు APIC యాక్సెస్‌ను అనుమతించుట ద్వారా వర్చ్యులైజ్డు x86_64 గెస్టు పనితనంను మెరుగుపరచును.
కొత్త వినియోగదారి స్పేస్ నోటిఫైర్స్ అనునవి CPU రిజిస్టర్స్ యొక్క క్యాచింగ్‌ను అనుమతించును, దానికొరకు అవి సందర్భ మార్పుల నందు వుపయోగించని మూలకముల యొక్క రిజిస్టర్ స్థితులను నిల్వ వుంచుటవంటి ఖర్చుతో కూడుకొనిన గణనచర్యలను విస్మరించును.
రీడ్ కాపీ అప్‌డేట్ (RCU) కెర్నల్ లాకింగ్ యిప్పుడు విస్తరిత సిమ్మెట్రిక్ మల్టీప్రోసెసింగ్ మద్దతును యిస్తోంది. RCU కెర్నల్ లాకింగ్ అనునది నెట్వర్కింగ్ ప్రమేయాలకు మరియు మల్టీ-ప్రోసెసింగ్ సిస్టమ్సుకు మంచి పనితనాన్ని అందించును.
15.1.3. నిల్వ
QEMU ఎమ్యులేటెడ్ బ్లాక్ డ్రైవర్ సౌలభ్యాలు పూర్తి ఎసింక్రొనస్ I/Oను, preadv మరియు pwritev ప్రమేయాలను మద్దతించును. ఈ ప్రమేయాలు QEMU ఎమ్యులేటెడ్ బ్లాక్ డ్రైవర్ వుపయోగించి నిల్వ పరికరముల పనితనమును పెంచును.
QEMU మానిటర్ ప్రొటోకాల్ (QMP) అనునది అనువర్తనములను QEMU మానిటర్‌తో సరిగా సంప్రదించుటకు అనుమతించును. QEMU అనునది టెక్స్టు-ఆధారిత ఫార్మాటును అందించును అది సులువుగా పార్శ్ చేయగలము మరియు ఎసింక్రొనస్ సందేశములు మరియు సామర్ధ్యములకు మద్దతించును.
పారా-వర్చ్యులైజ్డు (virtio) డ్రైవర్ కొరకు సూటిగాలేని రింగ్ ప్రవేశములు (స్పిన్ లాక్స్) బ్లాక్ I/O పనితనమును మెరుగుపరచును మరియు మరిన్ని ఏకకాలిక I/O ఆపరేషన్లను అనుమతించును.
రన్‌టైమ్ నందు గెస్టులకు వర్చ్యులైజ్డు నిల్వ పరికరములు యిప్పుడు కలుపవచ్చును మరియు తీసివేయవచ్చును (హాట్ ప్లగ్‌డ్).
బ్లాక్ ఎలైన్‌మెంట్ స్టోరేజ్ టోపాలజి అవగాహనకు మద్దతు. అందునవున్న నిల్వ హార్డువేర్ విశేషణములు మరియు భౌతిక నిల్వ సెక్టార్ పరిమాణములు (ఉదాహరణకు, 4KB సెక్టార్స్) అనునవి గెస్టులకు యివ్వబడును. ఈ సౌలభ్యమునకు అనుగుణ్యమైన నిల్వ పరికర సమాచారము మరియు ఆదేశములు కావలెను. గెస్టు టోపాలజీ అవగాహన అనునది వర్చ్యులైజ్డు గెస్టులు ఫైల్ సిస్టమ్ లేవుట్లను ఆప్టిమైజ్ చేయుటకు మరియు I/O ఆప్టిమైజేషన్సు వుపయోగించి అనువర్తనముల యొక్క పనితనమును మెరుగుపరచుటకు అనుమతించును.
qcow2 వర్చ్యులైజ్డు యిమేజ్ ఫార్మాట్ కొరకు పనితనపు విస్తరింపులు.
15.1.4. నెట్వర్కింగ్
vhost-net సౌలభ్యము అనునది వివిధ నెట్వర్కు ప్రమేయాలను QEMU వినియోగదారి స్పేస్‌నుండి కెర్నల్‌కు కదుల్చును. vhost-net అనునది కొద్ది సందర్భ స్విచెస్‌ను మరియు vmexit కాల్సును వుపయోగించును. ఈ విస్తరింపులు SR-IOV పరికరముల యొక్క, నేరుగా అప్పగించిన నెట్వర్కు పరికరము యొక్క మరియు యితర నెట్వర్కు పరికరముల యొక్కపనితనమును మెరుగుపరచును.
MSI-X మద్దతు యేదైతే నెట్వర్కు పరికరములకు అందుబాటులో వున్న ఆటంకముల యొక్క సంఖ్యను పెంచును. MSI-X మద్దతు అనునది అనుగుణ్యమైన హార్డువేర్ యొక్క పనితనమును పెంచును.
వర్చ్యులైజ్డు నెట్వర్కు పరికరములును యిప్పుడు నడుచుచున్న గెస్టులనుండి హాట్ ప్లగ్‌డ్ మరియు హాట్ రిమూవ్డ్ చేయవచ్చును. నెట్వర్కు బూట్ అనునది PXE నెట్వర్కు బూటింగ్‌కు మరింత అధనాతనమైన gpxe ను వుపయోగించుచున్నది.
15.1.5. కెర్నల్ సేమ్‌పేజ్ మెర్జింగ్
Red Hat Enterprise Linux 6 నందలి KVM హైపర్విజర్ కెర్నల్ సేమ్‌పేజ్ మెర్జింగ్ (KSM)ను అందించును, యిది KVM గెస్టులను సరిసమాన మెమొరీ పేజీలను పంచుకోనిచ్చుట ద్వారా జరుగును. పేజీ భాగస్వామ్యం అనునది మెమొరీ నకలును తగ్గించును మరియు యివ్వబడిన హోస్ట్ ప్రాక్టికల్ నందు వొకేవిధమైన గెస్టు ఆపరేటింగ్ సిస్టమ్స్ మరిన్ని నడుచునట్లు చేయును.
15.1.6. PCI పాస్‌త్రూ
PCI పాస్‌త్రూ (నేరుగా చేకట్టు) పరికరములు యిప్పుడు నడుచుచున్న గెస్టులనుండి హాట్ ప్లగ్‌డ్ మరియు హాట్ రిమూవ్డ్ చేయవచ్చును.
15.1.7. SR-IOV
SR-IOV యిప్పుడు వొక ముడి సాకెట్ రీతిని మద్దతించును. గతంలో నెట్వర్కింగ్ ఆటంకములు అనునవి టాప్ రీతినందు సాఫ్టువేర్ బ్రడ్జింగ్ ద్వారా సంభాలించబడేవి. స్థానిక నెట్వర్కు యింటర్ఫేస్‌లను గెస్టులకు చేకట్టుటను SR-IOV మద్దతించును.
SR-IOV, గతంలో, మైగ్రేషన్‌ను మద్దతించదు. vhost-net అబ్‌స్ట్రాక్షన్ అనునది SR-IOVను పారదర్శక చేకట్టుతో అందించును మరియు మెగ్రేషన్‌ను సరిసమానం-కాని సిస్టమ్సుతో అనుమతించును.
15.1.8. virtio-serial
పారా-వర్చ్యులైజ్డు సీరియల్ పరికరము (virtio-serial) అనునది హోస్టుయొక్క వినియోగదారి జాగా మరియు గెస్టుయొక్క వినియోగదారి జాగా మద్య సరళమైన సంప్రదింపుయింటర్ఫేస్‌ను అందించును. నెట్వర్కింగ్ అందుబాటులో లేనిచోట లేదా వుపయోగించలేనిచోట virtio-serialను సంప్రదింపు కొరకు వుపయోగించగలము.
15.1.9. sVirt
sVirt అనునది Red Hat Enterprise Linux 6.0 తో సరికొత్త విశేషణము అది SELinux మరియు virtualizationను సమగ్ర పరచును. sVirt అనునది వర్చ్యులైజ్డు గెస్టులను వుపయోగించునప్పుడు సురక్షణను మెరుగుపరచుటకు మాండేటరి యాక్సెస్ కంట్రోల్ (MAC)ను ఆపాదించును. sVirt రక్షణను మెరుగుపరచును మరియు హోస్టుకు లేదా వేరొక వర్చ్యులైజ్డు గెస్టుకు దాడి గుణకంగా వుపయోగించగల హైపర్విజర్ నందలి బగ్‌లకు వ్యతిరేకంగా సిస్టమ్‌ను పటిష్టపరచును.
15.1.10. మైగ్రేషన్
గెస్టు ABI స్థిరత్వం అనునది విస్తరిత మైగ్రేషన్ మద్దతును అందించును. గెస్టుల PCI పరికరము సంఖ్యలు అనునవి మైగ్రేషన్ నందు నిల్వవుంచబడును మరియు సరిసమాన PCI పరికర స్థానములు గెస్టు మైగ్రేషన్ జరిగినతర్వాత సమర్పించబడును.
మైగ్రేషన్ అనునది యిప్పుడు CPU మోడళ్ళుకు లెక్కించబడును. CPU మోడళ్ళు అనునవి కొత్త ప్రోసెసర్ సూచన సమితుల యొక్క ప్రయోజనాన్ని పొందుటకు గెస్టులను అనుమతించును. గెస్టులు అనునవి సారూప్యమైన CPU మోడల్‌తో హెస్టులకు మైగ్రేట్ కాగలవు.
కొత్త qdev పరికర రకముయొక్క భాగముగా, గెస్టు ABI అనునది యిప్పుడు స్థిరమైంది మరియు కొత్త విడుదలల కొరకు స్థిరముగా వుంచబడును. గెస్టులపైని పరికరములు మరియు పరికర అమర్పులు అనునవి భవిష్య నవీకరణల నందు స్థిరముగావుండును. ఈ సౌలభ్యము కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్ వుత్తేజన కార్యక్రమములతోని సమస్యలను పరిష్కరించును.
Note
Red Hat Enterprise Linux 6 అనునది సింపుల్ ప్రొటోకాల్ ఫర్ యిండిపెండెంట్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్స్ (SPICE) రిమోట్ డిస్‌ప్లే ప్రొటోకాల్ కొరకు ఫంక్షనాలిటిని అందించు మూలకాలను కలిగివుండును. ఈ మూలకములు Red Hat Enterprise Virtualization వుత్పత్తుల సంయోగం నందు వుపయోగించుటకు మద్దతించును మరియు స్థిరమైన ABIను కలిగివుండునని హామిలేదు. Red Hat Enterprise Virtualization వుత్పత్తుల యొక్క ఫంక్షనల్ అవసరములతో సింక్రొనైజ్ కావుటకు ఆ మూలకములు నవీకరించబడును. భవిష్య విడుదలలకు మైగ్రేట్ కావుటకు వొక్క-సిస్టమ్ చొప్పున మానవీయ ఆపరేషన్లు అవసరపడవచ్చును.
15.2. Xen
Red Hat Enterprise Linux 6 అనునది x86 మరియు AMD 64 మరియు Intel 64 ఆకృతుల కొరకు Xen గెస్టువలె మద్దతించును. పారా-వర్చ్యులైజ్డు ఆపరేషన్లు (pv-ops) అనునవి Red Hat Enterprise Linux 6 కెర్నల్ నందు చేర్చబడెను. అప్రమేయ Red Hat Enterprise Linx 6 కెర్నల్ అనునది Xen పారా-వర్చ్యులైజ్డు గెస్టు మరియు Xen పూర్తి వర్చ్యులైజ్డు గెస్టువలె Red Hat Enterprise Linux 5 హోస్టులపై వుపయోగించవచ్చును. Red Hat Enterprise Linux 6 అనునది పారా-వర్చ్యులైజ్డు డ్రైవర్లను పూర్తి వర్చ్యులైజ్డు Xen గెస్టు సంస్థాపనల కొరకు చేర్చును.
Red Hat Enterprise Linux 6 అనునది Xen హోస్టువలె మద్దతించదు.
ఇకపై చదువుటకు
Red Hat Enterprise Linux 6 నందు వర్చ్యులైజేషన్ సాంకేతికతలను సంస్థాపించుటను, ఆకృతీకరించుటను మరియు నిర్వహించుటను వర్చ్యులేజషన్ మార్గదర్శిని వివరించును.
15.3. virt-v2v
Red Hat Enterprise Linux 6 అనునది కొత్త virt-v2v సాధనమును అందించును, యిది సిస్టమ్ నిర్వహణాధికారులు Xen మరియు VMware ESX వంటి యితర సిస్టమ్స్ పైన సృష్టించిన వర్చ్యువల్ మిషన్లు మార్చుటకు మరియు దిగుమతి చేయుటకు అనుమతించును. virt-v2v అనునది Red Hat Enterprise Linux 5 హెపర్విజర్‌పై నడుచుచున్న Xen గెస్టుల కొరకు మైగ్రేషన్ పాత్‌ను అందించును.
16. మద్దతు మరియు నిర్వహణ
16.1. firstaidkit సిస్టమ్ రికవరీ టూల్
Red Hat Enterprise Linux 6 అనునది కొత్త firstaidkit సిస్టమ్ రికవరీ టూల్‌ను పరిచయం చేస్తోంది. సామాన్య రికవరీ కార్యక్రమమును స్వయంచాలనం చేయుట ద్వారా, firstaidkit అనునది యింటరాక్టివ్ యెన్విరాన్మెంట్‌ను సరిగా బూట్ కాని సిస్టమ్ యొక్క ట్రబుల్‌షూటింగ్ మరియు రికవరీ నందు సహాయపడుటకు అందించును. అదనంగా, సిస్టమ్ నిర్వహణాధికారులు స్వయంచాలన రికవరీ కార్యక్రమమును firstaidkit ప్లగిన్ ఆకృతిని వుపయోగించి సృష్టించగలరు.
Important
firstaidkit అనునది Red Hat Enterprise Linux 6 నందు సాంకేతిక పరిదృశ్యము వలె పరిగణించబడును.
Red Hat Enterprise Linux 6 కొత్త ఆటోమేటెడ్ బగ్ రిపోర్టింగ్ టూల్ (ABRT) అందించుచున్నది. ABRT సాఫ్టువేర్ క్రాష్‌ల యొక్క వివరములను స్థానిక సిస్టమ్ పైన లాగ్ చేయును, మరియు యింటర్ఫేసెస్ (గ్రాఫికల్ మరియు కమాండా లైన్ బేస్డ్) రెంటిని అందించును, Red Hat Bugzilla బగ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ నందు బగ్ నివేదించుటకు.
Figure 12. ఆటోమేటెడ్ బగ్ రిపోర్టింగ్ టూల్
17. వెబ్ సర్వర్లు మరియు సేవలు
17.1. అపాచీ HTTP వెబ్ సర్వర్
అపాచి HTTP సర్వర్ సర్వోత్కృష్టమైంది, వ్యాపార-తరగతి వోపెన్ సోర్స్ వెబ్ సర్వర్. Red Hat Enterprise Linux 6 అనునది అపాచి HTTP సర్వర్ 2.2.15 అదేవిధంగా ఫంక్షనాలిటిని విస్తరించుటకు రూపొందించిన సేవిక మాడ్యూళ్ళ సంఖ్యను కూడా చేర్చును.
Red Hat Enterprise Linux 6 నందలి అపాచి Server Name Indication (SNI) ప్రోటోకాల్‌కు మద్దతును అందించును, అది Secure Sockets Layer (SSL) అనుసంధానములనందు నేమ్-ఆధార వర్చ్యువల్ హోస్టింగ్‌ను చేతనము చేయును. అదనంగా, ఈ విడుదల నందు అపాచికి Web Server Gateway Interface (WSGI) కొరకు మద్దతు జతచేయబడెను, పైథాన్ వెబ్ అనువర్తన ఫ్రేమ్‌వర్క్స్ యొక్క వినియోగాన్ని చేతనము చేయును అది WSGI ప్రమాణాన్ని అభివృద్ది పరచును.
17.2. PHP: హైపర్‌టెక్స్ట్ ప్రీప్రోసెసర్ (PHP)
PHP అనునది HTML-ఎంబెడెడ్ స్క్రిప్టింగ్ భాష సామాన్యంగా అపాచీ HTTP వెబ్ సేవికతో వుపయోగించబడును. Red Hat Enterprise Linux నందు, PHP యిప్పుడు ప్రత్యామ్నాయ PHP క్యాచి (APC)ని మద్దతించును.
17.3. memcached
memcached అనునది అధిక-పనితనపు డిస్ట్రిబ్యూటెడ్ ఆబ్జక్ట్ క్యాచింగ్ సర్వర్ అది డైనమిక్ వెబ్ అప్లికేషన్ల యొక్క పనితనంను, డాటాబేస్ లోడ్ తగ్గించుట ద్వారా, పెంచుటకు రూపొందించబడింది. memcached అనునది యీ విడదల నందు కొత్త విశేషణము, మరియు C, PHP, Perl మరియు Python ప్రోగ్రామింగ్ భాషల కొరకు బందనములను అందించును.
18. డాటాబేస్‌లు
18.1. PostgreSQL
PostgreSQL అనునది అధునాతన Object-Relational డాటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (DBMS). postgresql ప్యాకేజీలు PostgreSQL DBMS సర్వర్‌ను యాక్సెస్ చేయుటకు కావలసిన క్లైంట్ ప్రోగ్రాములను మరియు లైబ్రరీలను చేర్చును.
Red Hat Enterprise Linux 6 అనునది PostgreSQL యొక్క వర్షన్ 8.4 అందించును
18.2. MySQL
MySQL అనునది బహుళ-వినియోగదారి, బహుళ-త్రెడెడ్ SQL డాటాబేస్ సర్వర్. ఇది MySQL సర్వర్ డెమోన్‌ను కలిగివుంటుంది (mysqld) మరియు చాలా క్లైంట్ ప్రోగ్రాములను మరియు లైబ్రరీలను కలిగివుంటుంది.
ఈ విడుదల MySQL యొక్క వర్షన్ 5.1 అందిస్తోంది. ఈ వర్షన్ అందించు అన్ని విస్తరింపుల జాబితా కొరకు MySQL విడుదల నోట్స్ చూడండి.
19. ఆకృతి సంభంద నోట్లు
Red Hat Enterprise Linux 6 ఆకృతి పరంగా పూర్తైంది, అన్ని మద్దతినిచ్చు ఆకృతులు యిప్పుడు అందుబాటులో వున్నాయి.
Red Hat Enterprise Linux 6 అనునది Intel® Itanium® ఆకృతి కొరకు మద్దతును అందించదు. అన్ని Itanium-related అభివృద్ది Red Hat Enterprise Linux 5 కు ప్రత్యేకించి చేర్చబడును. మార్చ్ 2014 వరకు, Red Hat Enterprise Linux 5 కు మద్దతు అందించబడును, కొత్త విశేషణములు అందించబడును, మరియు కొత్త Itanium హార్డువేరును Red Hat Enterprise Linux వుత్పత్తి లైఫ్-సైకిల్‌ను అనుసరించి ప్రచురించబడినట్లు చేతనముచేయును. అదనంగా, Red Hat Enterprise Linux 5 యక్క Itanium కొరకు విస్తరిత మద్దతు మార్చ్ 2017 వరకు యెంపికైన OEMలనుండి లభించును.
ఇతర POWER ఆకృతిపై, Red Hat Enterprise Linux 6 కు POWER6 లేదా యెక్కువ CPU కావాలి. Red Hat Enterprise Linux 6 పై POWER5 క్రమణిలు మద్దతించబడవు.
A. పునర్విమర్శిత(రివిజన్) చరిత్ర
Revision History
Revision 1
Wed Aug 12 2010
RyanLerch
Red Hat Enterprise Linux 6 విడుదల నోట్స్ యొక్క ప్రాధమిక వర్షన్